EPAPER

RRR Japan Collections: బాహుబలి 2 రికార్డుని దాటేసిన RRR

RRR Japan Collections: బాహుబలి 2 రికార్డుని దాటేసిన RRR

RR Japan Collections :తెలుగు సినిమా రేంజ్‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాలో బాహుబలి 2 టాప్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విదేశాల్లో కూడా అంతే. జపాన్‌లో బాహుబలి 2 చిత్రం 300 మిలియన్ యెన్‌లను సాధించింది. ఇప్పుడా రికార్డులను జపాన్‌లో RRR క్రాస్ చేసేసింది. జపాన్‌లో 209 స్క్రీన్స్, 31 ఐమ్యాక్స్ థియేటర్స్‌లో RRR రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 21న జపాన్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం 34 రోజుల్లో 305 మిలియన్ యెన్స్‌ను RRR కలెక్ట్ చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కలో రూ.17.9 కోట్లు గ్రాస్ అని సమాచారం. తొలి స్థానంలో ముత్తు సినిమా ఉంది. జపాన్ ఈ చిత్రం 400 మిలియన్ యెన్స్‌ని సాధించింది. త్వరలోనే RRR ఆ రికార్డుని కూడా అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRRలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇదొక ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తే.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. వీరిద్దరూ కలిసి బ్రిటీష్ వారిని ఎలా ఎదిరించారనేదే సినిమా. 1920 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్, చరణ్‌లతో పాటు అజయ్ దేవగణ్, శ్రియాశరన్ వంటి బాలీవుడ్ స్టార్స్.. అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు.


Related News

Tammareddy Bharadwaj: త్రివిక్రమ్ పై పూనమ్ ఫిర్యాదు.. మేము ఏం చేయలేం

Singer Mano: సింగర్ మనో కొడుకులపై కేసు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి

Garudan: తమిళ్ రీమేక్ లో కుర్ర హీరోలు.. ఒకరిని మించి ఒకరు ఉన్నారే

Comedian Ali: సండే గర్ల్ ఫ్రెండ్ అంటున్న ఆలీ

Martin:మార్టిన్ సినిమా పోస్ట్ పోన్ కానుందా.. అసలు కారణం ఏంటంటే..?

Akkineni Nagarjuna: N కన్వెన్షన్ కూల్చివేత.. నాగార్జున అన్నయ్య సంచలన వ్యాఖ్యలు

Gorre Puranam : గొర్రె పురాణం రిలీజ్ ఉన్నట్టా లేనట్టా? సినిమాను పట్టించుకోని నిర్మాత, హీరో

Big Stories

×