EPAPER

RRR : హాలీవుడ్ సినిమాను దాటేసిన భారతీయ సినిమా

RRR : హాలీవుడ్ సినిమాను దాటేసిన భారతీయ సినిమా

RRR : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలను చూసి కొంతమంది మేధావులు అసలు హాలీవుడ్ సినిమాలు చూసి చాలా నేర్చుకోవాలి అంటూ మాటలు చెబుతూ ఉండేవాళ్ళు. కానీ తెలుగు సినిమా హాలీవుడ్ సినిమా స్థాయిని మించిపోయింది. తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి మాత్రమే ఉంది అని చెప్పాలి. శాంతినివాసం సీరియల్ కు దర్శకుడుగా పనిచేసిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ (Student Number 1) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రతి దర్శకుడికి ఆడియన్స్ ఒక పల్స్ తెలియాలి అంటారు. ఆ మాట నిజమైతే ఆడియన్స్ పల్స్ తెలిసిన ఏకైక డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పాలి. ఇప్పటివరకు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) కెరియర్ లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా పడలేదు. ప్రతి సినిమా కూడా ఎస్ఎస్ రాజమౌళి స్థాయిని మాత్రమే పెంచుకున్న తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచింది అని చెప్పాలి.


తెలుగులో వచ్చిన బాహుబలి సినిమా స్థాయి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి (Bahubali) సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గుర్తింపు లభించింది. ఒక సినిమా కోసం దాదాపు ఐదేళ్లపాటు టైం కేటాయించిన ప్రభాస్ కూడా ఈ విషయంలో గ్రేట్ అని చెప్పాలి. మామూలుగా ఐదేళ్లలో 10 సినిమాలు చేసే అవకాశం ఉంది కానీ రాజమౌళి ఆలోచనలు నమ్మి బాహుబలి కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు కష్టపడి సినిమా చేశాడు. బాహుబలి సినిమా తోనే తెలుగు సినిమా స్థాయి ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ (Ntr) రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆస్కార్ అవార్డు కూడా అందుకునే స్థాయి వరకు ఈ సినిమా వెళ్ళింది. సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు.

కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సక్సెస్ ఫుల్ గా త్రిబుల్ ఆర్ సినిమా కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ సినిమా 2.5 బిలియన్ కలెక్షన్స్ వసూలు చేసి నేటికీ జపాన్ లో సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. దాదాపు ఈ సినిమాకి 17 మిలియన్స్ కలెక్షన్స్ వచ్చింది. ఇకపోతే క్రిష్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఓపెన్ హైమెర్ 12 మిలియన్ కలెక్షన్లు వచ్చాయి. డెడ్ పూల్ సినిమాకి 14 మిలియన్ కలెక్షన్స్, దునే సినిమాకు నాలుగు మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలు ఏవి కూడా ట్రిపుల్ ఆర్ సినిమాను మించి కలెక్షన్ చేయలేకపోయాయి. చాలామంది హాలీవుడ్ సినిమాతో కంపేర్ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు కామ్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.


Related News

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కు విముక్తి, సిట్టింగ్స్ షురూ

Game Changer: రెండు రాష్ట్రాలలో నాలుగు సినిమాలకి ఒకరే డిస్ట్రిబ్యూటర్

Richest Singer : ఈ సింగర్ ముందు షారుక్ కూడా దిగదుడుపే.. అసలు మేటర్ ఏంటంటే..?

Devara: ఒక మంచి సినిమా తీయడమే కాదు కరెక్ట్ టైం కి రిలీజ్ చేయడం కూడా అవసరం

Anil Ravipudi: ఖచ్చితంగా సంక్రాంతికి వస్తారు

SS Rajamouli : ట్రిపుల్ ఆర్ సినిమాను మించిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు

Big Stories

×