EPAPER
Kirrak Couples Episode 1

Ram Gopal Varma : ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై స్పందించిన ఆర్జీవి.. ఇలా చేస్తే బెటర్..

Ram Gopal Varma : ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై స్పందించిన ఆర్జీవి.. ఇలా చేస్తే బెటర్..

Ram Gopal Varma : టాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. మొన్న నిర్మాత, నిన్న జానీ మాస్టర్ ఇక గతంలో బయట పడనివి చాలానే ఉన్నాయి.. ఈమధ్య రోజుకో వార్త హాట్ టాపిక్ అవుతుంది. ఇక మలయాళం ఇండస్ట్రీలో హేమా కమిటీ సంచలన తీర్పును ఇచ్చింది. అది ఇండస్ట్రీలో దుమారం రేపుతుంది. చాలా మంది బాధితులు బయటకు వచ్చి తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్పారు. ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న చాలా మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ డ్యాన్సర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ప్రస్తుతం మాస్టర్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. తాజాగా లైంగిక వేధింపుల కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


లైంగిక వేధింపుల కేసుల పై వర్మ కీలక సలహాలు..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా వేధికగా సంచలన విషయాలను బయట పెట్టాడు.. ఇండస్ట్రీ లోకి రావాలనుకునే మహిళలు ఆయా డిపార్ట్ మెంట్ కు సంబంధించిన కమిటీలో మెంబర్ షిప్ తీసుకోవాలి. కొత్తవారికి ముందుగా అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? ఏ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది? ఏవైనా వేధింపులు ఎదురైతే కమిటీకి ఎలా చెప్పాలి? అనే విషయాలపై క్లారిటీ ఇస్తే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం పై అవగాహన ఉంటుందని చెప్పాడు.. మెంబర్ షిప్ లేని వారిని సినిమాల్లోకి తీసుకోకూడదు అనే కండీషన్ పెట్టాలి. అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవారి గురించి కమిటీకి తెలుస్తుందనే భయం ఉంటుందని వర్మ అంటున్నారు.


RGV responded to sexual harassment in the industry..
RGV responded to sexual harassment in the industry..

అప్పుడు అమ్మాయిలను మాయ చేయాలనుకునేవారు కంట్రోల్ అవుతారు. అందుకే, అప్ కమింగ్ యాక్టర్లకు అవగాహన కార్యక్రమాలు అనేవి చాలా ముఖ్యం. మెంబర్ షిప్ ఉంటే సదరు అమ్మాయిలను ఎక్స్ ప్లాయిడ్ చేయకూడదని ప్రొడ్యూసర్లకు అర్థం అవుతుంది. అమ్మాయిల పై లైంగిక వేధింపుల కేసులు తల నొప్పిగా మారవని చెబుతున్నారు.. ఇక వర్మ సినిమాల విషయానికొస్తే.. ‘శారీ’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. గిర కృష్ణ కమల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆరాధ్య దేవి, సత్య యదు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు నుంచి విడుదలైన టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటివరకు వర్మ రాజకీయాలను కుదేలు చేసేలా సినిమాలు చేసాడు. ఆ సినిమాలు అన్ని పెద్ద దుమారం రేపాయి .. ఇప్పుడు బోల్డ్ జానర్ లో సినిమాలు చేస్తున్నాడు. డేంజరస్ సినిమా చేసాడు ఆ మూవీ కి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పుడు శారీ సినిమాతో వస్తున్నాడు. అది ఎంతవరకు వివాదాలను అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

Harsha Sai: బిగ్ బాస్ బ్యూటీపై హర్షసాయి అత్యాచారం.. వాడుకొని వదిలేశాడు

Hema Committee Report: హేమ కమిటీ రిపోర్ట్‌పై సినిమా.. రంగంలోకి దిగనున్న కాంట్రవర్షియల్ డైరెక్టర్

Pawan Kalyan: కార్తీ క్షమాపణపై పవన్ కళ్యాణ్ స్పందన.. సూర్య, జ్యోతికలను ఉద్దేశిస్తూ ఏమన్నారంటే?

Sreeleela : ఓర్నీ ఇది డ్యాన్సా.. శ్రీలీల డ్యాన్స్ పై సెటైర్స్..

Harsha Sai:పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై యువతీ ఫిర్యాదు

Pawan Kalyan: పవన్ తప్పు చేశావ్.. నిన్ను వదలేది లేదు అంటున్న తమిళ తంబీలు.. ?

Star Singer: అది లేకపోవడం వల్లే విడాకులు పెరుగుతున్నాయి.. సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్..!

Big Stories

×