EPAPER

Renu Desai: ప్లీజ్ సాయం చెయ్యండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నాను.. రేణు దేశాయ్ వేడుకోలు

Renu Desai: ప్లీజ్ సాయం చెయ్యండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నాను.. రేణు దేశాయ్ వేడుకోలు

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఫ్యామిలీ అంతా ఫుల్ ఖుషిగా ఉంది. ఇక మాజీ భార్య రేణు దేశాయ్ తో పాటు ఆమె పిల్లలు ఆద్య, అఖిరా నందన్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. ఇంకేముంది విడాకులు తీసుకున్నప్పటికీ ఇటు పవన్, అటు రేణు దేశాయ్ ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు అనుకున్నారు మెగా ఫాన్స్. అంతలోనే రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా హెల్ప్ లెస్ గా ఉన్నాను అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తూ సాయం చేయండి అని వేడుకుంటోంది.


అసలేం జరిగిందంటే…

రేణూ దేశాయ్ ని సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ సహాయాన్ని అర్థించాడు. తాము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక గ్రామంలో ఉంటున్నామని తెలిపిన ఆ నెటిజన్ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి తమను ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయాన్ని రేణు దేశాయ్ దృష్టికి తీసుకువచ్చారు. “మేడం మేము సీరియస్ ప్రాబ్లంలో ఉన్నాము. లోకల్ గవర్నమెంట్ వాళ్లు మా విలేజ్ కి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఎవరితో మా సమస్యను చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. 70 ఏళ్లుగా మేము నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొస్తుంది. వీళ్ళకి మేము వాటర్ బిల్ తో పాటు హౌస్ బిల్ కట్టడం, ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాము. ఇలాంటి టైంలో దాదాపు 20 నుంచి 30 కుటుంబాలను ఒకేసారి ఖాళీ చేయమని చెప్తున్నారు. మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు దయచేసి హెల్ప్ చేయండి మేడం” అంటూ సోషల్ మీడియా వేదికగా సహాయాన్ని అర్థించాడు ఆ నేటిజన్. అంతేకాకుండా తమది భీమవరం అని, లోకల్ ఎమ్మెల్యేని అడిగితే ముందుగా హెల్ప్ చేస్తామన్నారని, కానీ ఆ తర్వాత మాత్రం చాలా రూడ్ గా మాట్లాడారని ఆవేదనను వ్యక్తం చేసాడు సదరు వ్యక్తి. పైగా అతను టీడీపీ ఎమ్మెల్యేనే అని ఆ వ్యక్తి చెప్పడం గమనార్హం.


Pawan Kalyan's Ex Wife Renu Desai Approaches Court Against Telangana Govt For Aqua Marine Park Project | Entertainment News, Times Now

రేణు దేశాయ్ సమాధానం ఏంటంటే?

రేణు దేశాయ్ ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని, తాను గవర్నమెంట్ కు సంబంధించిన వ్యక్తిని కాదని, కాబట్టి లోకల్ ప్రెస్ వాళ్ళ దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాలని పేర్కొంది. ఆ తర్వాత సదరు చాట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలాంటి మెసేజ్ లు వచ్చినప్పుడు నేను హెల్ప్ లెస్ గా ఫీల్ అవుతున్నాను. నాకు వాళ్లకి హెల్ప్ చేయాలని నిజంగానే ఉంది. కానీ నేను గవర్నమెంట్ ద్వారా ఎన్నికైన వ్యక్తిని కాదు. కాబట్టి ఎవరైతే వీళ్ళకు హెల్ప్ చేయగలరో దయచేసి చేయండి” అంటూ రిక్వెస్ట్ చేసింది. దీంతో కొంతమంది నెటిజన్లు ఉపముఖ్యమంత్రిగా మీ మాజీ భర్త ఉన్నాడు కదా, ఆయనని హెల్ప్ అడగండి అంటూ సజెషన్ ఇస్తున్నారు. మరి పవన్ ఈ వివాదం పై రియాక్ట్ అవుతాడా లేదా అనేది చూడాలి.

Related News

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Actress : యాడ్ షూట్ లో డర్టీ పనులు… స్టార్ హీరో అసభ్యకరంగా తాకాడంటూ హీరోయిన్ ఆరోపణలు

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Sobhita Dhulipala: అక్కినేని కోడలా.. మజాకానా.. ఎమ్మీ అవార్డ్స్ కు శోభితా బోల్డ్ సిరీస్

Chiranjeevi : పక్కొడి పనిలో వేలు పెడుతారు… చాలా కాన్ఫిడెంట్‌గా చిరుకి కౌంటర్

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగర్జున వ్యాఖ్యలు వైరల్

Big Stories

×