EPAPER
Kirrak Couples Episode 1

Devara Movie : ‘దేవర’ కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే?

Devara Movie : ‘దేవర’ కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే?

Devara Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన తాజాగా చిత్రం ‘దేవర’ మూవీ.. నేడు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ నుంచి సోలో మూవీ వచ్చేసింది. షోస్ మొదలైన ఈ చిత్రానికి ఆరంభం లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మెల్లగా టాక్ పెరుగుతూ పోతుంది. తారక్ నటవిశ్వరూపం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇదంతా పక్కనపెడితే సినిమాకు ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..


‘దేవర ‘ కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యూనరేషన్..

త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పై అంచనాలు మాములుగా లేవు.. గతంలో తారక్‌తో ‘జనతా గ్యారేజ్’ తీసిన కొరటాల దీనికి దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తీసిన ఈ చిత్రానికి దాదాపు రూ.300 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలి సుధాకర్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో మెరిసిన ఎన్టీఆర్ దాదాపుగా రూ. 65 కోట్లు తీసుకున్నాడని సమాచారం.. ఇక హీరోయిన్‌ జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, విలన్‌గా చేసిన సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ రూ 1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీశర్మ రూ.40 లక్షలు తీసుకున్నారని సమాచారం..


ఇక మొదటి రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్క్‌ను అతిక్రమించే అవకాశం ఉంది. ఈ విజయంతో తారక్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనర్‌గా ఈ మూవీ నిలవనుంది. ఇక రూ.75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌లను నమోదు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ పోర్టల్ సక్‌నిల్క్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్/తెలంగాణ మార్కెట్‌లో ఈ చిత్రానికి రూ.70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రావొచ్చునని అంచనా వేస్తున్నారు.. ఇకపోతే దేవర కు ఆంధ్రప్రదేశ్‌లో రూ. 16.31 కోట్ల టిక్కెట్‌ విక్రయాలు జరగగా, కర్ణాటక లో రూ. 5.85 కోట్ల టిక్కెట్లు, తెలంగాణలో 12.88 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.. ఇక ఈ వీకెండ్ అంటే రేపు, ఎల్లుండి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు టాక్.. చూడాలి మరి ఎన్ని కోట్లు రాబడుతుందో.. మొత్తానికి ఎన్టీఆర్ ఖాతాలో హిట్ పడినట్లే కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 , ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో తర్వాత సినిమాకు రెమ్యునరేషన్ ను పెంచే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్ ..

Related News

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. Big Tv తో జానీ మాస్టర్ భార్య అయేషా..

Nag Ashwin : ‘కల్కి 2’ తర్వాత ఆ స్టార్ హీరోతో నాగీ సినిమా?

Young Heroine: ఒక్క అవకాశం కోసం 5 మంది.. భరించలేకపోయా..?

Namrata shirodkar: ఏంటీ.. మహేష్ కంటే ముందు నమ్రత ఇంకొకరిని ప్రేమించిందా.. అతని పరిస్థితి తెలిస్తే కన్నీళ్లాగవ్..!

Trisha : విజయ్ తో త్రిష ఎఫైర్ నిజమేనా?.. ఒక్క ఫోటోతో అడ్డంగా దొరికేసిందే..

Emergency : ఆ సీన్లు కట్ చేస్తేనే ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికెట్… కంగనాకు ఎదురు దెబ్బ

Janhvi Kapoor : సపోర్టింగ్ క్యారెక్టర్ కు ఎక్కువ, ఐటం గర్ల్ కి తక్కువ… ఈమాత్రం దానికే అంత బిల్డప్ ఇచ్చారా?

Big Stories

×