EPAPER

Eagle 2nd Day Collections: రవితేజ ‘ఈగల్’ రెండో రోజు కలెక్షన్స్.. ఎంత వచ్చిందంటే?

Eagle 2nd Day Collections: రవితేజ ‘ఈగల్’ రెండో రోజు కలెక్షన్స్.. ఎంత వచ్చిందంటే?
Telugu cinema news

Ravi Teja’s Eagle Second Day Collections: మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. సంక్రాంతి పోరులో పలు సినిమాలు రిలీజ్ కానుండటంతో థియేటర్లు కరువై పోస్ట్ పోన్ చేసుకుంది. ఇక ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే మిక్సిడ్ టాక్ అందుకుంది.


ఈ మూవీలో యాక్షన్ సీన్స్ హైలెట్‌గా ఉన్నాయని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఈ మూవీపై ఎక్కువగా కేజీఎఫ్ ప్రభావం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఫస్ట్ హాప్ అంతా ఎలివేషన్స్ కోసమే అయిపోయిందని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ మూవీకి తగ్గ పోటీ లేకపోవడంతో సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్లపై తాజాగా చర్చ సాగుతోంది. ఈ మూవీకి దాదాపుగా రూ.22 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ బిజినెస్‌కు తగ్గట్టుగానే మేకర్స్ ఈ మూవీని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో కలిపి మొత్తంగా 700 స్క్రీన్‌లలో ఈ సినిమాను రిలీజ్ చేయగా.. ఓవర్సీస్‌లో మొత్తం 400 స్క్రీన్‌లలో ప్రదర్శిస్తున్నారు.


READ MORE: Eagle First Day Collections : ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అదిరిపోయిన మాస్ ఓపెనింగ్స్

ఇదంతా ఒకెత్తయితే.. ఈ మూవీకి వచ్చిన రెండు రోజుల కలెక్షన్స్ మొత్తం ఎంతో తెలుసుకుందాం.

మొదటి రోజు చూసుకుంటే.. ఈ సినిమా ఓవర్సీస్‌లో అమెరికా, కెనడాలో దాదాపు 65కె, యూకే, ఐర్లాండ్‌లో 23కె, ఆస్ట్రేలియాలో 8కె, యూఏఈ,గల్ఫ్ దేశాల్లో 250 డాలర్లు వసూళు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇండియాలో చూసుకుంటే.. ఏపీ, నైజాంలో 4 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.1 కోటి కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా మొత్తం రూ.6కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక రెండో రోజుకు వచ్చేసరికి ఈ సినిమా వసూళ్లు కాస్త డ్రాప్ అయినట్లు సమాచారం. రెండో రోజు కేవలం రూ.4.75 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా రెండు రోజులకి కలిపి రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

READ MORE: Eagle Movie Review & Rating: ఈగల్ రివ్యూ.. మాస్ మహారాజా డిజాస్టర్ రికార్డుల నుంచి తేరుకున్నాడా..?

ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ప్రకారం.. ఈ మూవీని హిట్టుగా పరిగణించాలంటే మొత్తం రూ.23 కోట్లు రాబట్టాలి. ప్రస్తుతం వచ్చిన కలెక్షన్స్ ప్రకారం.. ఈ సినిమా మరో రూ.12 కోట్లు సాధించాల్సి ఉంటుంది. చూడాలి మరి ఈ మూవీ మరికొన్ని రోజుల్లో ఎంతమేరకు కలెక్ట్ చేస్తుందో.

కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దావ్జాండ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలక పాత్రలో కనిపించారు.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×