Raveena Ravi: ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు చాలా వరకు ఇండస్ట్రీలో ఉండే వారినే ప్రేమించి, వారితోనే ఏడడుగులు వేయడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే అటు హీరోయిన్స్ అయినా, ఇటు డబ్బింగ్ ఆర్టిస్టులైనా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టులైనా ఇలా ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఉండే వారిని సాధ్యమైనంత వరకు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితులు మగవారికి బాగా తెలుసు అనే కారణం ఒక ఎత్తైతే , ప్రేమించాము అనే కారణం మరో ఎత్తు. ఏదేమైనా ఇప్పుడు సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో పడి వివాహానికి సిద్ధమవుతోందని సమాచారం.
డైరెక్టర్ తో ప్రేమలో పడ్డ రవీనా రవి..
అసలు విషయంలోకి వెళితే.. తమిళ్, తెలుగు, మలయాళం వంటి భాషా చిత్రాలలో వందలాదికి పైగా సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసిన రవీనా రవి నయనతారతో సహా చాలా మంది లేడీ సెలబ్రిటీలకు డబ్బింగ్ అందించింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేయడంతో పాటు పలు హిట్ సినిమాలలో కూడా నటించింది రవీనా రవి. ముఖ్యంగా లవ్ టుడే, ఒరు కిదయిన్ కరుణై మను వంటి సినిమాలలో నటించిన ఈమె, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు మలయాళ దర్శకుడు దేవన్ జయకుమార్ (Devan Jayakumar)తో తన సంబంధాన్ని బహిర్గతం చేసింది. దేవన్ జయ కుమార్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ , ఈ ఫోటో కింద.. “నస్వరమైన క్షణాల ప్రపంచంలో మేము శాశ్వతమైన దానిని కనుగొన్నాము. కలిసి మేము మా కథను రాసుకుంటాము” అంటూ ఒక అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇకపోతే ఈ విషయం తెలిసి నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
డైరెక్టర్ దేవన్ జయకుమార్ కెరియర్..
డైరెక్టర్ దేవన్ జయకుమార్ విషయానికి వస్తే.. మలయాళ చిత్రం వాలాట్టి కి దర్శకత్వం వహించారు. ఇది పూర్తిగా కుక్కల చుట్టూ నడిచే కథాంశంతో రూపొందింది. ఈ చిత్రంలో రవీనా అమలు అనే ఒక కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పింది. అలా అలా మనుషులకే కాకుండా కుక్కలకి కూడా డబ్బింగ్ చెప్పి తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది. ఇకపోతే దర్శకుడు దేవాన్ జయకుమార్, రవీనారవి వాలాట్టి సినిమాకి పనిచేసే సమయంలోనే ఒకరికొకరు పరిచయం చేసుకొని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని సమాచారం. ఇప్పుడు ఎట్టకేలకు ప్రేమలో ఉన్నట్లు ధృవీకరించారు. మరి వివాహం చేసుకోబోతున్నట్లు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
రవీనా రవి విషయానికి వస్తే..
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటి గా కూడా పేరు తెచ్చున్న ఈమె.. రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన అనేక టెలివిజన్ ప్రకటనలకు తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో డబ్బింగ్ ఇచ్చింది. ఈమె ఎవరో కాదు ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ శ్రీజా రవి , నటుడు ,గాయకుడు రవీంద్రనాథన్ కృష్ణన్ ల కుమార్తె. ఈమె 2012లో సత్తై అనే చిత్రానికి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. ఇందులో మహిమ నంబియర్ కు ఆమె గాత్రదానం చేసింది.
View this post on Instagram