EPAPER

Rashmika Mandanna: వరుస ఆఫర్లతో రష్మిక ..బాలీవుడ్ క్రష్మీక అవుతుందా..!

Rashmika Mandanna: వరుస ఆఫర్లతో రష్మిక ..బాలీవుడ్ క్రష్మీక అవుతుందా..!

Rashmika Mandanna: ఛలో మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఎక్స్ప్రెషన్ తో ఎక్స్ప్రెషన్ క్వీన్ గా అభిమానుల మది దోచుకున్న స్టార్ రష్మిక. కానీ టాలీవుడ్ లో ఆమెకు స్టార్ డమ్ తెచ్చిన చిత్రం మాత్రం విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతా గోవిందం. ఇంకేం..ఇంకేం..కావాలి సాంగ్ కి…రష్మిక ఎక్స్ప్రెషన్స్ కి కుర్ర కారు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ క్రష్ రష్మిక ఇప్పుడు బాలీవుడ్ క్రష్ గా మారుతుంది.


ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా ఈ కూర్గ్ భామ కోసం ఒక సినిమా పూర్తి కూడా కాకముందే రెండవ సినిమా క్యూ కడుతుంది. ఎంత పోటీ ఉన్న ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు కొత్త ఛాన్సులు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది రష్మిక. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో రష్మిక లేటెస్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అనూహ స్పందన అందుకుంది. మరి ముఖ్యంగా మేఘాలలో తేలిపోతూ,ప్రైవేట్ జెట్ ప్లేన్ లో హీరో హీరోయిన్ మధ్య హాట్ లిప్ లాక్ పై సోషల్ మీడియాలో పలు రకాల రెస్పాన్స్ వస్తున్నాయి.

కొందరు అద్భుతంగా ఉంది అంటే ,కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు ఈ సీన్ చూసి అయ్యో పాపం ఫీల్ అయిందేమో అంటూ తమ సానుభూతి వ్యక్తీకరిస్తున్నారు. అయితే ఆలియా మాత్రం వీళ్ళందరికీ తన రేంజ్ రిప్లై ఇస్తూ ఆ ఫోటోని షేర్ చేయడమే కాకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని పోస్ట్ పెట్టింది. ఇప్పటికే
మిషన్ మజ్ను, గుడ్ బై వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించిన రష్మిక ప్రస్తుతం రణబీర్ కపూర్ తో చేస్తున్న యానిమల్ మూవీతో బాగా హైలైట్ అవుతుంది.


ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్ తో పాటు సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం అటు ఉంచితే ప్రస్తుతం రష్మికా కు బాలీవుడ్ లో మరొక అవకాశం వచ్చినట్లు టాక్. అయితే అది స్టార్ హీరో తో కాదు ప్రస్తుతం బాలీవుడ్ మిడ్ రేంజ్ హీరో విక్కీ కౌశల్ తో. హీరో మీడ్ రేంజ్ అయినా అతను తీసే మూవీస్ కంటెంట్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది కాబట్టి హిట్ అయితే రష్మిక బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

ఈ ఆఫర్ నచ్చడంతో రష్మిక ఓకే కూడా చెప్పేసిందట. యూరి మూవీతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విక్కి ,ఆ తరువాత వరుసగా ఛాన్సులు అందుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా విక్కి సారా అలీ ఖాన్ తో కలిసి నటించిన
జర హట్కే జర బచ్కే మూవీ సూపర్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆ మూవీ నుంచి వచ్చిన తేరే వాస్తే పాట సోషల్ మీడియా సంచలనంగా మారింది .

ఇక ఆ ఊపుతోనే మరో బ్లాక్ బస్టర్ చేయడానికి విక్కీ రెడీ అవుతున్నాడు.ఈ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ డ్రామా కు
రాహుల్ జనార్దన్ యాదవ్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ పొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ఇక అక్టోబర్ 16 నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే జోరుతో వరస మూవీస్ చేస్తూ రష్మీక బాలీవుడ్ లోనే
సెటిల్ అయ్యే అవాకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×