Rashmika Mandanna: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా తర్వాత రష్మిక మందనా (Rashmika Mandanna).. సౌత్ హీరోయిన్ నుండి ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఆ మూవీలో తన నటన బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు మేకర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకోవడంతో తనకు తెలుగు నుండి కంటే హిందీ నుండే ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉండగా అందులో భారీ బడ్జెట్ హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. అనూహ్యంగా రష్మిక.. తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ సైన్ చేసింది. దీని ద్వారా ప్రెస్టిజీయస్ సినిమాటిక్ యూనివర్స్‌లో అడుగుపెట్టింది. దానికి సంబంధించిన ఊహించని అప్డేట్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేసింది.
టైటిల్ గ్లింప్స్
బాలీవుడ్‌లో పెద్దగా సినిమాటిక్ యూనివర్స్‌లు లేవు. ఉన్నది రెండే. అందులో ఒకటి స్పై యూనివర్స్. మరొకటి హారర్ కామెడీ యూనివర్స్. ఇటీవల ఈ హారర్ కామెడీ యూనివర్స్‌లోకి రష్మిక మందనా అడుగుపెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాత దినేష్ విజన్.. ఈ హారర్ కామెడీ యూనివర్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పటికే ఇందులో ఎన్నో హారర్ కామెడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఇందులో నుండే మరో మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. అదే ‘థామ’ (Thama). ఇక ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రివీల్ చేయగా.. రష్మిక కూడా ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి నయనతార పెళ్లి డాక్యుమెంటరీ.. ఎక్కడ చూడొచ్చంటే?
వచ్చే దీపావళికి
‘దినేష్ విజన్ హారర్ కామెడీ యూనివర్స్‌కు ఒక లవ్ స్టోరీ కావాల్సి వచ్చింది. కానీ దురదృవశాత్తు అది రక్తపాతంతో నిండిపోయింది’ అంటూ ‘థామ’ టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేసింది రష్మిక మందనా. అంతే కాకుండా 2025 దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని కూడా ప్రకటించింది. ఇందులో రష్మికకు జోడీగా ఆయుష్మాన్ ఖుర్రానా నటిస్తుండగా పరేశ్ రావల్, నవాజుద్దీన్ సిద్ధికీ లాంటి సీనియర్ యాక్టర్లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ హారర్ కామెడీ యూనివర్స్ నుండి ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్య’ సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా విడుదలయిన ‘స్త్రీ 2’ కూడా ఇదే యూనివర్స్‌కు చెందింది.
అన్నీ హిట్టే
ఇప్పటివరకు ఈ బాలీవుడ్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి విడుదలయిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు అదే యూనివర్స్‌లోకి తను కూడా ఎంటర్ అయ్యి బాలీవుడ్‌లో తన మార్క్‌ను పర్మినెంట్‌గా క్రియేట్ చేసుకోవాలని రష్మిక మందనా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సికిందర్’ కాగా.. మరొకటి విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ‘ఛావా’. రష్మిక ఒక అప్డేట్ రాబోతుందని అని పోస్ట్ చేయగానే ఇందులో ఏదో ఒక మూవీ గురించి అప్డేట్ ఇస్తుందేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ‘థామ’ అప్డేట్ ఇచ్చి అందరికీ షాకిచ్చింది.
Dinesh Vijan’s Horror Comedy Universe needed a love story… unfortunately, it's a bloody one. 💘
Brace yourselves for #Thama – Diwali 2025! 💥@ayushmannk #PareshRawal @Nawazuddin_S #DineshVijan @amarkaushik @AdityaSarpotdar @nirenbhatt @Suresh_Mathew_ #ArunFulara… pic.twitter.com/IvermO25F0
— Rashmika Mandanna (@iamRashmika) October 30, 2024