EPAPER

Deep Fake : నిన్న రష్మిక.. నేడు కరీనా.. రంగంలోకి సెంట్రల్ మినిస్టర్..

Deep Fake : నిన్న రష్మిక.. నేడు కరీనా.. రంగంలోకి సెంట్రల్ మినిస్టర్..
Deep Fake

Deep Fake : గత కొద్దిరోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం విపరీతంగా పెరగడంతో సోషల్ మీడియాలో కొన్ని అవాంఛిత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పై కావాలనే కొందరు ఫేక్ వీడియోస్, ఫొటోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇటువంటివి సోషల్ మీడియాలో వెంటనే వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతున్నాయి. వీటి కారణంగా సొసైటీ పై పొంచి ఉన్న పెను ప్రమాదం ఎంతో ఉంది.


ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స.. ప్రజలకు యూస్ అవ్వాల్సిన ఈ టెక్నాలజీని కొందరు ఆకతాయిలు దుర్వినియోగ పరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో నడిచే పలు రకాల వెబ్ సైట్స్,యాప్స్ సులభంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. వీటిని చాలామంది దుర్వినియోగ పరుస్తున్నారు. ఈ ఆప్స్ ఉపయోగించి చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు మార్ఫింగ్ చేయడం రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది.

సెలబ్రిటీలకు సంబంధించిన డీప్ ఫేక్ ఫొటోస్ ,వీడియోస్ వైరల్ అవుతున్నాయి. వేరే ఫేస్ ఉన్న వారి వీడియో తీసుకొని ఎంతో సులభంగా వాటికి సెలబ్రిటీల ఫోటోలను జత చేసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయం తో డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేస్తున్నారు. వీడియో చూసిన వారికి ఏది నిజం..ఏది అబద్దం అన్నది అస్సలు అర్థం కానంత రియల్ గా ఉన్నాయి. పాపం ఈ డీప్ ఫేక్ కు మొన్న రష్మిక పరేషాన్ అయితే.. నిన్న కత్రినా కంగారు పడింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం ఇటువంటి డీప్ ఫేక్ వీడియోస్ చేసి వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


రీసెంట్గా ఈ ఇష్యూ పై సెంట్రల్ ఐటీ మినిస్టర్ స్పందించారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66లోని సెక్షన్ కింద ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్లకు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఎవరైనా కృత్రిమంగా ఇటువంటి కంటెంట్ తయారు చేసి ఉన్నట్లయితే 24 గంటల్లో వాటిని తొలగించాలని లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది.

రోజురోజుకీ ఇంటర్నెట్లో పెరిగిపోతున్న ఈ మార్ఫింగ్ వీడియోలను అరికట్టడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ యాక్ట్ ప్రకారం నేరం రుజువైన పక్షంలో మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా వేసే అవకాశం కూడా ఉంది. ఓ పక్క రష్మిక వీడియో సోషల్ మీడియాలో సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే సైబర్ నెరగాళ్లు కత్రినా డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో ఆన్లైన్ లో దింపారు. దీంతో వెంటనే స్పందించకపోతే విషయం మరింత చేయి జారిపోతుంది అని భావించిన ప్రభుత్వం విషయాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. కనీసం ఇప్పటికైనా ఈ సైబర్ నేరగాళ్లు ఇటువంటి పనులు చేయడం మానితే బాగుంటుందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×