EPAPER

Rana : ఇప్పటికీ రానా అందులో వీక్.. ఇలా షాక్ ఇచ్చాడేంటి భయ్యా..?

Rana :  ఇప్పటికీ రానా అందులో వీక్..  ఇలా షాక్ ఇచ్చాడేంటి భయ్యా..?

Rana : టాలీవుడ్ యంగ్ హీరో రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వచ్చాడు. ఇక బాహుబలి సినిమాతో ఏకంగా ప్రపంచం స్టార్ అయ్యాడు.. రానాకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు అంతగా బాహుబలితో క్రేజ్ ని సంపాదించుకున్నాడు . ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు కానీ ఆ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రానా అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకొని ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడు. అయితే సినిమాలు మాత్రం అంతగా లేవనే చెప్పాలి. ప్రస్తుతం రానా హీరోగా చేయడం కన్నా సినిమాలను నిర్మిస్తున్నాడు ఇప్పటికే రెండు సినిమాలను ఇప్పటికే పలు సినిమాలను నిర్మించి సక్సెస్ను అందుకున్నాడు . హీరో రానా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తయింది సినిమా అంటే మొదటి సినిమా లీడర్ తన కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత తనకి అత్యంత పాపులర్ అయిన సినిమా అంటే ఎక్కువగా బాహుబలి పేరే వినిపిస్తుంది . ఈ సినిమాలో బల్లాలదేవ క్యారెక్టర్‌లో.. పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు రానా. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రానా అంతగా సక్సెస్ కాకపోవడానికి అతి పెద్ద కారణం ఉందని రానా ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాడు ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ల అయినా తాను అలాంటి వాటిలో వీక్ అని చెప్పడం సోషల్ మీడియాలోలో వైరల్ గా మారింది.


ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో చరిత్ర సృష్టించిన రానా .. ఆల్ వి ఇమేజిన్ లైట్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో ఘనతను కూడా దక్కించుకున్నాడు రానా. ఎంత ప్రతిష్టాత్మకమైన ఆసియా పసిఫిక్ స్క్రీన్ పురస్కారాల్లోనూ ఐదు నామినేషన్ లో చోటు దక్కించుకుని రికార్డ్ సృష్టించాడు. ఇది రానా కెరియర్ లో అతి పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. నవంబర్ 30న ఆస్ట్రేలియాలో ఈ వేడుకలు గ్రాండ్గా జరగనున్నాయి. ఈ సందర్భంగా రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తాడు.

రానా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు . ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు గడిచాయి. ఇప్పటికి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారో తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పెద్ద స్టార్ హీరోల సినిమాలవ‌న‌వ‌స‌రం లేదు.. కథలో కంటెంట్, ఎమోషన్స్ నిండి ఉంటే ప్రతి సినిమా ప్రత్యేకతను చాటుకుంటుందని తెలుసుకున్నా అంటూ వివ‌రించాడు. ఇకపోతే రానా 2004 లో వచ్చిన బొమ్మలాట అనిమేషన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సినిమా కథ బాగుంటే కచ్చితంగా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారని రానా చెప్పారు ఇక రానా సినిమాల విషయానికొస్తే ఇటీవల 35 చిన్న కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాను రానా నిర్మించారు. ప్రస్తుతం ఓటీటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే మరో రెండు సినిమాలను నిర్మించే పనులు రానా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.


Related News

Abhishek Bachchan: ఆ హీరోయిన్ తో అభిషేక్ ఎఫైర్.. అందుకే ఐశ్వర్యకు విడాకులు.. ?

Akhanda 2 : అఖండ 2 ఫుల్ స్టోరీ లీక్..బోయపాటి దెబ్బకు ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

Anasuaya: వీడు అనసూయ మొగుడా.. అలా ఉన్నాడేంటి అని బండబూతులు తిట్టారు

RRR Movie: జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సంచలనం.. 71 ఏళ్ల తర్వాత ఈ మూవీనే..

Rahul sipligunj: నా కెరియర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే.. జీవితాంతం..!

Kareena Kapoor: స్పిరిట్ లో కరీనా.. క్లారిటీ ఇచ్చేసిందిగా

Big Stories

×