Rana On Mr Bachchan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో హరీష్ శంకర్ ఒకరు. ముందుగా నటుడుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత రచయితగా మంచి పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత రవితేజ, జ్యోతిక నటించిన షాక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. ఆ సినిమా హరీష్ శంకర్ కి మంచి పేరు తెస్తుంది అని అందరూ భావించారు. కానీ ఆ సినిమా హరీష్ శంకర్ కి కెరీర్ కి షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్లీ రచయితగా అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ మొదలు పెట్టాడు హరీష్. షాక్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత చిరుత, బుజ్జిగాడు వంటి సినిమాలకు పూరి జగన్నాద్ దగ్గర రచయితగా పనిచేశాడు.
రవితేజ (Ravi Teja) మళ్ళీ దర్శకుడిగా మిరపకాయ్ (Mirapkay) సినిమాతో హరీష్ శంకర్ కు అవకాశం ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. హరీష్ శంకర్ కి మన స్ట్రెంత్ అంటే డైలాగ్స్ అని చెప్పాలి. కరెక్ట్ గా రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిపడా డైలాగ్స్ రాసి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. అయితే రీ రిలీజ్ కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమా తర్వాత దబాంగ్ సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేశాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఎప్పటినుండో పవన్ కళ్యాణ్ లో మిస్ అయిన ఎనర్జీ అంతటినీ కూడా గబ్బర్ సింగ్ సినిమాలో చూపించి సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నాడు హరీష్. ఇప్పటికీ హరీష్ శంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత అంతటి హిట్ సినిమా పవన్ కళ్యాణ్ పడింది. ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసుకుంది.
Also Read: Sai Pallavi on Thandel movie: ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు
ఈ సినిమా తర్వాత హరీష్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ సాధించుకున్నాయి. మళ్లీ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వలన షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా లేట్ అవుతున్న ప్రాసెస్లో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా చాలా అంచనాలతో రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సాధించి ఫెయిల్ అయింది. ఈ సినిమా టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే.. రీసెంట్ గా జరిగిన ఒక అవార్డు ఫంక్షన్లో కూడా ఈ సినిమాను ట్రోల్ చేశారు. రీసెంట్గా ఐఫా అవార్డు ఫంక్షన్ జరిగింది. దీనిలో భాగంగా అమితాబచ్చన్ కి కల్కి సినిమాకి సంబంధించిన అవార్డు వచ్చింది. అమితాబచ్చన్ కి కల్కి సినిమాకి సంబంధించిన అవార్డు వచ్చింది. అమితాబచ్చన్ గారు ఈ ఇయర్ హైయెస్ట్ హై తో పాటు లోయస్ట్ లో కూడా చూశారు అంటూ రానా అనౌన్స్ చేశాడు. పక్కనున్న హోస్ట్ తేజ లోయస్ట్ లో ఏంటి అనగానే మిస్టర్ అంటూ ఆపేసాడు. ఇక ఈ ఇయర్లో రిలీజ్ అయింది మిస్టర్ బచ్చన్ సినిమా మాత్రమే. ఆ విధంగా ఈ సినిమాను అవార్డు ఫంక్షన్లో కూడా ట్రోల్ చేశారు.