EPAPER

Sri Rama : రీల్ లైఫ్‌లో రాముడి రికార్డులు..!

Sri Rama : రీల్ లైఫ్‌లో రాముడి రికార్డులు..!
Sri Rama

Sri Rama : అయోధ్యలో శ్రీరాముడి భవ్య ఆలయం రూపుదిద్దుకుంది. దేశమంతటా రామనామ జపం మారుమోగుతోంది. వేల ఏళ్ల తర్వాత కూడా జననీరాజనాలు అందుకుంటున్నాడంటే రాముడికి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. వెండితెరపైనా జగదభిరాముడు విశ్వరూపం కనిపిస్తుంది. వెండితెర అయినా, బుల్లి తెర అయినా రామాయణమే ఇతివృత్తంగా ఉంటే చాలు.. అది సూపర్ సక్సెస్సే.


అంతెందుకు? రాముడు, కృష్ణుడి పాత్రలను పోషించిన ఎన్టీఆర్‌ని ఇప్పటికీ దేవుడిగా కొలిచేవారున్నారు. రాముడు అంటే ఇలాగే ఉంటాడన్న భావనను కలగజేయగలగడం ద్వారా ఆయన ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకోగలిగారు. సరిగ్గా 36 ఏళ్ల క్రితం బుల్లితెరపై రామానంద సాగర్ ‘రామాయణ్’ ప్రసారమైనప్పుడు దేశమంతా టీవీలకు అతుక్కుపోయింది. వీధుల్లో ఒక్కరు కనిపిస్తే ఒట్టు. కర్ప్యూ విధించిన వాతావరణం అప్పట్లో నెలకొంది.

పౌరాణిక పాత్రల ద్వారా ఎన్టీఆర్‌కు అమితమైన పాపులారిటీ సంపాదించారు. రాముడి పాత్రలో ఆయన బాగా మెప్పించారు. లవకుశ(1963), శ్రీ రామాంజనేయ యుద్ధం(1974) తదితర చిత్రాల్లో రాముడిగా.. ఎన్టీఆర్ ప్రజల మెప్పు పొందారు. రాముడు, రామాయణం ఆధారంగా బోలెడు సినిమాలు వచ్చాయి. నిరుడు విడుదలైన ‘ఆదిపురుష్’ భారీ బడ్జెట్ చిత్రం. రూ.600 కోట్లతో దానిని నిర్మించారు. ఇటీవల విడుదలైన ‘హనుమాన్’ ఎంత సక్సెస్ అయిందో తెలుసు. రామాయణం ఇతివృత్తంగా సినిమా తీస్తే.. ఆ ఫార్ములాకు ఇక తిరుగుండదనే విషయం ఈ సినిమాతో మరో‌సారి స్పష్టమైంది.


ఇక 111 ఏళ్ల హిందీ సినిమా చరిత్రలో రామాయణంపై ఇప్పటివరకు 50 సినిమాలు, దాదాపు 20 టీవీ షోలు తీశారు. అన్నింటికీ మంచి కలెక్షన్లే లభించాయి. దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే ఓసారి విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఏసుక్రీస్తుపై తీసిన సినిమా చూశారు. దీంతో దేశంలో పౌరాణిక సినిమాలు తీయవచ్చనే ఆలోచన వచ్చింది. దీంతో 1917లో రామాయణం మీద తొలి హిందీ సినిమా ‘లంకా దహన్’ తీశారు. తొలి ప్రదర్శన ముంబైలోని మెజెస్టిక్ సినిమా హాల్‌లో జరిగింది. 107 ఏళ్ల క్రితం విడుదలైన ఆ మూకీ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.35 వేలు రాబట్టింది. కలెక్షన్లన్నీ నాణేల్లో ఉండటం వల్ల.. వాటిని ఎడ్లబండ్లలో తరలించారని ఇప్పటికీ చెప్పకుంటుంటారు.

లంకా దహన్ సినిమాలో విశేషం ఏమిటంటే.. రాముడు, సీత పాత్రలు రెండింటినీ ‘అన్నా హరి సాలుంకే’ అనే నటుడే పోషించాడు. అప్పట్లో మహిళలు నటన అంటే ఆమడ దూరంలో ఉండేవారు. దీంతో హిందీ చిత్రసీమలో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రికార్డు కూడా సాలుంకే సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కథ రాముడి 14 ఏళ్ల వనవాసంతో మొదలై రావణ వధతో ముగుస్తుంది. లంకాదహన్‌తో రామాయణంపై సినిమాలు తీయడం ఓ ట్రెండ్‌గా మారింది. ఆ తర్వాత 1943లో వచ్చిన ‘రామ్-రాజ్య’ సినిమాకూ అప్పట్లోనే రూ.60 లక్షల మేర వసూళ్లు వచ్చాయి. మహాత్మా గాంధీ మెచ్చిన సినిమాల్లో ఇదొకటి.

1920 నాటికి పౌరాణిక చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. ఈ చిత్రాల ద్వారానే ఖలీల్ అహ్మద్ మూకీ, టాకీ చిత్రాలలో తొలి సూపర్ స్టార్ కాగలిగారు. ముస్లిం అయినప్పటికీ హిందూ దేవుళ్ల పాత్రలు పోషించి మెప్పించగలిగారు. మూకీ సినిమాయుగం ఆరంభమైన తర్వాత 1940లో రాముడి పాత్రలను నటించి ప్రజాదరణ పొందిన మరో నటుడు ప్రేమ్ అదీబ్. రామాయణం, రాముడి గాథ ఆధారంగా తీసిన 8 సినిమాల్లో రాముడి పాత్ర పోషించారు. ఆయన నటించిన రామరాజ్యం రూ.60 లక్షల బిజినెస్ చేసింది. ఆ సినిమా బడ్జెట్ రూ.5 లక్షలు.

ఇక టీవీల్లో పౌరాణిక కార్యక్రమాల శకాన్ని తీసుకొచ్చిన ఘనత రామానంద్ సాగర్‌కే దక్కుతుంది. రామాయణాన్ని టీవీ షోగా చూపించాడు. దూరదర్శన్‌లో మొదటిసారిగా రామాయణ్ 87 ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి. 25 జనవరి 1987న ఆరంభం కాగా.. చివరి ఎపిసోడ్ 31 జూలై 1988న ప్రత్యక్ష ప్రసారమైంది. అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చిక్లియా సీతగా, అరవింద్ త్రివేది రావణుడిగా, సునీల్ లాహిరి లక్ష్మణుడిగా, ధారా సింగ్ హనుమంతుడిగా నటించిన ఆ టీవీ సీరియల్ పిన్నలను, పెద్దలను ఎంతగా అలరించిందో తెలుసు.

రామాయణం ఆధారంగా జపాన్‌లోనూ ఓ సినిమా తీశారు. ‘రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ పేరుతో తీసిన యానిమేషన్ చిత్రమిది. యానిమేషన్‌ రూపంలో రామాయణం సినిమా తీయడాన్ని అప్పట్లో హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామన్న నిర్మాతల హామీతో ఆ వివాదం సద్దుమణిగింది. 1992లో ఆ యానిమేషన్ మూవీని విడుదల చేసే సమయంలోనే బాబ్రీ మసీదు వివాదం రేగింది. దాంతో రిలీజ్ నిలిచిపోయినా.. అనంతరం కార్టూన్ నెట్‌వర్క్‌లో ప్రదర్శించారు.

Related News

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Big Stories

×