BigTV English

Ramabanam Review : రామబాణం దూసుకెళ్లిందా..? గోపిచంద్ హిట్ కొట్టాడా..?

Ramabanam Review : రామబాణం దూసుకెళ్లిందా..? గోపిచంద్ హిట్ కొట్టాడా..?


Ramabanam Review(Gopichand New Movie Updates) : హీరో గోపీచంద్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉంటాడు. కానీ కొన్నాళ్లుగా స‌రైన హిట్స్ అందుకోలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు గోపీచంద్ భారీ అంచ‌నాల మధ్య రామ‌బాణం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. గ‌తంలో గోపీచంద్‌తో లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టారా..?

క‌థ‌ : యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రామబాణం తెరకెక్కింది. ఈ మూవీలో అన్నదమ్ముల అనుబంధాన్ని చక్కగా చూపించారు. కార్పొరేట్ మాఫియా నేపథ్యంలో కథ సాగుతుంది. ఆ మాఫియా వల్ల తన కుటుంబానికి ఎదురైన కష్టాలను హీరో గోపీచంద్ ఎలా ఎదుర్కొన్నాడు? తన ఫ్యామిలీని కాపాడుకునే క్రమంలో ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? హీరోకి జ‌గ‌ప‌తిబాబు ఎలాంటి స‌పోర్ట్ అందించాడు. ఈ అంశాలన్నీ వెండితెర‌పై చూడాల్సిందే.


గోపీచంద్ త‌న పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జగపతిబాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెప్పే పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. సినిమా మొత్తం కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. హీరోయిన్ డింపుల్ హయాతి యూట్యూబర్ గా తన గ్లామర్ తో ఆకట్టుకుంది.

దర్శకుడు శ్రీవాస్ రామబాణం మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ సినిమాకు ప్లస్ అయ్యాయి. యాక్షన్ పార్ట్ అదిరిపోయింది. కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. మిక్కీ. జె. మేయర్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. యాక్షన్ సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి . వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అదిరింది. భూపతి రాజా అందించిన కథ కాస్త పాతదిగా ఉండటం సినిమాకు చిన్న మైన‌స్ పాయింట్.

గోపీచంద్ సినిమాలంటే యాక్షన్ సీన్స్ ఎలివేషన్ లు క‌చ్చితంగా బాగుంటాయి. అదే ఈ సినిమాలోనూ కనిపించింది. శ్రీవాస్ అన్ని అంశాలను మిక్స్ చేసి ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాను అందించాడు. జగపతిబాబు, గోపీచంద్ మధ్య అన్నదమ్ముల అనుబంధాన్ని చాలా బాగా చూపించాడు. అన్నయ్య జగపతిబాబు, వదిన కోసం గోపీచంద్ చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. రొమాన్స్, కామెడీ, డ్రామా ఇలా అన్ని అంశాలతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రామబాణం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది.

For more updates about Allari Naresh Movie Ugramm Check Here : ఉగ్రం మూవీ రివ్యూ & రేటింగ్స్

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×