EPAPER

Siva Movie: ‘శివ’ సినిమాకు 35 ఏళ్లు.. ఇది ఒక ఫేమస్ యాక్షన్ చిత్రానికి కాపీ అని మీకు తెలుసా?

Siva Movie: ‘శివ’ సినిమాకు 35 ఏళ్లు.. ఇది ఒక ఫేమస్ యాక్షన్ చిత్రానికి కాపీ అని మీకు తెలుసా?

Siva Movie Completes 35 Years: హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్.. ఇవన్నీ కాకుండా మరొక కేటగిరీ కూడా ఉంటుంది. అవే గేమ్ ఛేంజర్స్‌గా మారిన సినిమాలు. కొన్ని చిత్రాల వల్ల ఆ భాష సినీ పరిశ్రమకే గుర్తింపు లభిస్తుంది. అలాంటి గేమ్ ఛేంజర్ సినిమాలు తెలుగులో కూడా చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ‘శివ’. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ మూవీతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. డెబ్యూతోనే ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసి సీనియర్ దర్శకులకు సైతం పోటీ ఇచ్చే సత్తా తనలో ఉందని నిరూపించాడు. తాజాగా ‘శివ’ విడుదలయ్యి 35 ఏళ్లు అవుతుండడంతో దీని గురించి ఒక ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఈ సినిమా కథను కాపీ కొట్టానని వర్మ స్వయంగా ప్రకటించారు.


కాపీ కొట్టాను

నాగార్జున కెరీర్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అవి సూపర్ హిట్ కూడా అయ్యాయి. కానీ ‘శివ’ సినిమాలో ఆయన చేసిన పాత్ర మాత్రం ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్‌కు ఫేవరెట్. ఎప్పుడూ మన్మథుడిగా అమ్మాయిల మనసు దోచుకునే పాత్రల్లోనే ఎక్కువగా కనిపించారు నాగ్. అలాంటి ఆయన అప్పుడప్పుడు కమర్షియల్ చిత్రాల్లో కనిపిస్తూ యాక్షన్ రోల్స్ కూడా చేశారు. అలాంటి యాక్షన్ రోల్స్‌లో ‘శివ’ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతుంది. అయితే ఈ మూవీలోని శివ పాత్ర, కథ, యాక్షన్.. వీటన్నింటిని ఒక ఫేమస్ హాంగ్ కాంగ్ సినిమా నుండి కాపీ కొట్టానని అప్పట్లో రామ్ గోపాల్ వర్మ స్వయంగా ప్రకటించి షాకిచ్చారు. ఇక ‘శివ’ విడుదలయ్యి 35 ఏళ్లు అవుతుండడంతో మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.


Also Read: మా ప్రొడ్యూసర్ తిట్టుకున్న పర్లేదు, చెప్తే ఇది కాంట్రవర్సీ అవుతుంది

చాలా పోలికలు

బ్రూస్ లీ.. ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆయన చూపించే యాక్షన్‌కు, తెరకెక్కించే సినిమాలకు వరల్డ్‌వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆయన హీరోగా నటిస్తూ నిర్మించి, డైరెక్ట్ చేసిన చిత్రమే ‘ది వే ఆఫ్ ది డ్రాగన్’. 1972లో విడుదలయిన ఈ హాంగ్ కాంగ్ యాక్షన్ చిత్రం.. బ్రూస్ లీ ఇతర సినిమాలలాగానే బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. తాను ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు ‘ది వే ఆఫ్ డ్రాగన్’లో లాగానే హీరో క్యారెక్టరైజేషన్, యాక్షన్ ఉండాలని రామ్ గోపాల్ వర్మ నిర్ణయించుకున్నారట. అందుకే ‘శివ’ సినిమాకు, ‘ది వే ఆఫ్ డ్రాగన్’కు చాలా దగ్గర పోలికలు ఉంటాయి.

సైకిల్ చైన్ సీన్

కేవలం చదువుపైనే ఫోకస్ చేసే స్టూడెంట్.. కాలేజీ పాలిటిక్స్‌ను మార్చేసే యూత్ లీడర్‌గా ఎలా మారాడు అనేది ‘శివ’ కథ. అప్పట్లో ఈ సినిమా కథకు చాలామంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. 1989 అక్టోబర్ 5న విడుదలయిన ఈ మూవీ.. ఎన్నో థియేటర్లలో 100 రోజులకు పైగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. పైగా ఈ సినిమాలోని సీన్స్‌ను యూత్ బాగా ఇమిటేట్ చేసేవారు. ముఖ్యంగా సైకిల్ చైన్ సీన్‌ను అయితే ఇప్పటికీ చాలామంది మర్చిపోలేదు. అలా ‘శివ’ సినిమాతో టాలీవుడ్‌లో తన మొదటి అడుగును బలంగా పడేలా చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత తను తెరకెక్కించిన చాలావరకు సినిమాలు.. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో వచ్చి ప్రేక్షకులను అలరించాయి.

Related News

Mallika Sherawat: ఆ హీరో అర్ధరాత్రి తలుపు కొట్టడంతో.. ఆ క్షణమే పోయాననిపించింది..!

Khadgam Re-Release: 22 యేళ్ళ తర్వాత రీ రిలీజ్.. శ్రీకాంత్ ఏమన్నారంటే..?

Dasara 2024 Movies: వచ్చేవారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలివే.. ఆ మూడు రోజులు సందడే సందడి

Matka Movie Teaser: మెగా హీరో హిట్ కొట్టినట్టేనా.. టీజర్ తోనే హైప్ ..!

VD 12 : విజయ్ దేవరకొండ సినిమాకు మరో అడ్డంకి.. ఏనుగుల బీభత్సంతో షూటింగ్ రద్దు

Harsha Sai : హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ… అవన్నీ రూమర్లేనా?

Big Stories

×