EPAPER
Kirrak Couples Episode 1

Ram Charan: నెపోటిజంపై స్పందించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్

Ram Charan: నెపోటిజంపై స్పందించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్

Ram Charan: తండ్రి బాట‌లో సినీ రంగంలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న హీరో రామ్ చ‌ర‌ణ్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం RRR . గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం ఈ ఏడాదిలో ఏకంగా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట‌కు ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో ఆస్కార్ అవార్డ్ రావ‌టంపై అంద‌రూ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆస్కార్ అవార్డ్ తీసుకున్న త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ తండ్రి చిరంజీవితో క‌లిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాను ప్ర‌త్యేకంగా క‌లిశారు. అనంత‌రం ఆయ‌న అక్క‌డే మీడియా ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. పలు విష‌యాల గురించి ఓపెన్‌గా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు. వాటిలో నెపోటిజం గురించి కూడా మాట్లాడారు చ‌ర‌ణ్‌. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే..


‘‘నెపోటిజం మీద జ‌రుగుతున్న చ‌ర్చ నాకెప్పుడూ అర్థం కాదు. అంద‌రూ అంటారు కాబ‌ట్టి మిగిలిన‌వారు కూడా అంటుంటారేమో. అస‌లు అందులోని లైన్ల గురించి ఎంత మంది అర్థం చేసుకుంటారో కూడా ఊహించ‌లేం. ప్ర‌ఖ్యాత జ‌ర్న‌లిస్టు పిల్ల‌లు జ‌ర్న‌లిస్టు కావాల‌నుకుంటారు. త‌ల్లిదండ్రుల బాట‌లో పిల్ల‌లు న‌డ‌వాల‌నుకోవ‌డం మ‌న‌కు ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న‌దే. నాకు సినిమా అంటే పంచ‌ప్రాణాలు. నేను పుట్టిన‌ప్ప‌టినుంచే ఫిల్మ్ స్కూల్లో ఉన్నా. నాకు ఆ క‌ళ తెలుసు. నేను ప‌నిని స‌క్ర‌మంగా చేయ‌క‌పోతే ఈ ఇండ‌స్ట్రీలో ఉండ‌లేను. త‌ల్లిదండ్రులు ఈ రంగంలో పేరు ప్ర‌ఖ్యాతుల‌తో ఉంటే, ఒక్క‌డుగు ధైర్యంగా వేయ‌గ‌లుగుతారేమో! కానీ, త‌ద‌నంత‌రం మ‌న టాలెంటే మాట్లాడుతుంది. కేజీయ‌ఫ్ స్టార్ య‌ష్ తండ్రి స్టార్ కాదు. కానీ ప్ర‌తిభ‌ను ఎవ‌రూ ఆప‌లేరు. ఎవ‌రి విష‌యంలోనైనా అదే చెల్లుతుంది’’ అన్నారు.

చరణ్ ఇంకా ఆస్కార్ వేదిక‌పై నాటు నాటు పాట‌కు డాన్స్ చేయ‌క‌పోవ‌టంపై కూడా రామ్ చ‌ర‌ణ్ స్పందిస్తూ.. ‘‘ఆస్కార్ వేడుక జ‌ర‌గ‌డానికి ముందు మాలో ఎలాంటి భావోద్వేగాలు లేవు. కంగారుతో స్త‌బ్దుగా అనిపించింది. నా భార్య నా చేతిని గ‌ట్టిగా ప‌ట్టుకోవ‌డం గుర్తుంది. మైక్ టైసన్ గ‌ట్టిగా ప‌ట్టుకున్న‌ట్టు అనిపించింది. ఆస్కార్‌లో నాటు నాటు పాట‌కు నృత్యం చేయ‌డానికి నేను 100 శాతం సిద్ధంగానే ఉన్నాను. కానీ అక్క‌డేం జ‌రిగిందో నాకు నిజంగా తెలియ‌దు. అక్క‌డ పెర్ఫార్మ్ చేసిన‌వారు మాక‌న్నా చాలా బాగా చేశారు. భార‌త‌దేశానికి చెందిన పాట‌కు ఇంకెవ‌రో స్టేజ్ మీద నృత్యం చేస్తుంటే చూసి ఆనందించ‌డం మావంతైంది. నాటు నాటు మ‌న భార‌తీయ గీతం.


నాటు నాటుకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రినీ ప్ర‌శంసించాలి. ఉక్రెయిన్‌కి చెందిన 200 మంది క్రూ మెంబ‌ర్స్ ని కూడా ప్ర‌శంసించారు. నేను, నా భార్య వెకేష‌న్‌కి ఉక్రెయిన్‌కి వెళ్లాల‌నుకున్నాం. కానీ పాట చిత్రీక‌రించిన మూడు నెల‌ల్లోపే అక్క‌డ యుద్ధం జ‌రిగింది’’ అని తెలిపారు రామ్ చరణ్.

SAMANTHA: నాగ చైతన్యను పెళ్లి చేసుకొని తప్పు చేశా.. సమంత ఫీలింగ్ ఇదేనా?

Taraka Ratna: వాళ్లు మ‌న‌ల్ని ప‌దే ప‌దే బాధ పెట్టారు.. తార‌క‌ర‌త్న భార్య పోస్ట్ వైర‌ల్

Related News

Madhoo Bala: సీనియర్ నటి మధుబాల కూతుళ్లను చూశారా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Veena Srivani: ప్రాయశ్చిత్త శ్లోకాలంటూ ఓవర్ యాక్షన్.. క్షమాపణ చెప్పండి.. వేణుస్వామి భార్య సంచలన వ్యాఖ్యలు

Ratan Tata: నిర్మాతగా మారిన రతన్ టాటా.. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా గురించి మీకు తెలుసా?

Karthi: మహేష్- రాజమౌళి సినిమాలో కార్తీ.. ఆయన ఏమన్నాడంటే.. ?

Ananya Panday: ఏంటి పాప నీ కోరిక.. ఫ్యాన్స్ హర్ట్ అవ్వరూ ..!

Swag: శ్రీ విష్ణు స్వాగ్.. కాన్సెప్ట్ నచ్చలేదా లేక శ్రీ విష్ణునే మెప్పించలేదా..?

Koratala Siva: ఆ స్టార్ హీరోతో సినిమా చేయను.. దేవర డైరెక్టర్ కఠిన నిర్ణయం వెనుక కారణం..?

Big Stories

×