EPAPER

Ram Charan in Vijay’s Leo : లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రామ్ చరణ్..

Ram Charan in Vijay’s Leo : లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రామ్ చరణ్..
ram charan

Ram Charan in Vijay’s Leo : ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు అనేదానికంటే తీసిన సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఎంజాయ్ చేశారు అనే అంశం ఈరోజుల్లో చాలా ముఖ్యంగా మారింది. అందుకే సీనియర్ దర్శకుల కంటే యంగ్ డైరెక్టర్స్‌కే క్రేజ్ ఎక్కువగా పెరిగిపోయింది. అలా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తమిళ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ తరువాతి చిత్రం గురించి ఒక క్రేజీ రూమర్ బయటికొచ్చింది.


ఇప్పటికే ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో లోకేశ్ కనకరాజ్ కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్‌లోకి యాడ్ అయిపోయాడు. తన సినిమా కథలనే కలిపి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ) అనేది క్రియేట్ చేసి యూత్‌లో బాగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా ‘లియో’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది కూడా ఎల్‌సీయూలో ఒక భాగమే అని ఇప్పటికే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. తాజాగా ఈ మూవీ గురించి ఒక క్రేజీ రూమర్ సినీ పరిశ్రమలో వైరల్‌గా మారింది.

లియో సినిమా ప్రారంభమయినప్పటి నుండి ఇప్పటివరకు గ్యాప్ లేకుండా షూటింగ్ సాగుతూనే ఉంది. ఇక ముందుగా అనుకున్నట్టుగానే 2023 అక్టోబర్ 19న సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీమ్ అనుకుంటోంది. ఇందులో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తోంది. ఇక తాజాగా లియోలో రామ్ చరణ్ ఒక గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని రూమర్స్ వైరల్ అయ్యాయి. లియోలో కచ్చితంగా ఒక గెస్ట్ పాత్ర ఉంటుందని, అది రామ్ చరణే చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.


తాజాగా లియో సినిమాకు సంబంధించిన అధికారిక సోషల్ మీడియా పేజ్‌లో కోలివుడ్, టాలీవుడ్ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. దీంతో టాలీవుడ్‌కు సంబంధించిన ఒక స్టార్ హీరో.. లియోలో ఉంటాడని దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. కానీ అది ఎవరు అని మూవీ టీమ్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలోనే ఈ పాత్ర రామ్ చరణ్ చేస్తున్నాడంటూ రూమర్స్ వైరల్ అయ్యింది. ఒకవేళ ఈ రూమర్ నిజమయితే.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే కాకుండా దీని వల్ల సినిమాకు మరింత హైప్ కూడా పెరిగే అవకాశం ఉంది.

Related News

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగర్జున వ్యాఖ్యలు వైరల్

Renu Desai: ప్లీజ్ సాయం చెయ్యండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నాను.. రేణు దేశాయ్ వేడుకోలు

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Big Stories

×