EPAPER

Ram Charan : బాబాయ్ బాటలో అబ్బాయి, మనం చేసే పనిలో మంచి కనిపించాలి, మనం కాదు

Ram Charan : బాబాయ్ బాటలో అబ్బాయి, మనం చేసే పనిలో మంచి కనిపించాలి, మనం కాదు

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చిరు తనయుడిగా చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద తన పంజా బలాన్ని చూపించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక సరికొత్త హీరో దొరికాడు అని అనిపించుకున్నాడు. తండ్రి పేరుని కచ్చితంగా నిలబెట్టగలిగే సామర్థ్యం ఇతనిలో ఉంది అని మొదటి సినిమాకే చాలామందికి అర్థం అయిపోయింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాతో తెలుగు సినీచరిత్రలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ను క్రియేట్ చేశాడు. ఒక్కసారిగా అక్కడితో రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత వరుస డిజాస్టర్ సినిమాలు చరణ్ వెంటాడాయి. చరణ్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న కొద్ది చాలా విషయాల్లో అనేక మార్పులు పొందాడు అని చెప్పాలి. ఎన్నో సందర్భాల్లో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఓపెన్ గా వార్నింగ్స్ కూడా ఇచ్చేవాడు. ఆ తర్వాత అన్ని విషయాల్ని పట్టించుకోవడం మానేశాడు.


ఇక రాంచరణ్ కెరియర్ ధ్రువ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమాతోనే తండ్రి మించిన తనయుడు అని అనిపించుకున్నాడు. ఆ సినిమా ఎటువంటి సంచలమైన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించుకున్నాడు. ఇప్పుడు చరణ్ కంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి. కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. ఇంతకుముందు చాలా మందికి సహాయాన్ని అందించారు రామ్ చరణ్. కానీ ఈ విషయం పెద్దగా బయటపడలేదు.

తనతో పాటు షూటింగ్లో ఉన్న సత్య ను కూడా సొంత ఫ్లైట్లో హైదరాబాద్ వరకు తీసుకొచ్చారు. ఒక హీరో తన సినిమాలో నటించే ఒక నటుడిని అలా సొంత ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అక్కడితో చరణ్ మీద రెస్పెక్ట్ చాలామందికి పెరిగిపోయింది. మనం సైతం అనే కార్యక్రమానికి కూడా ఎంతో ఆర్థిక సహాయాన్ని అందించాడు చరణ్. ఇక తాజాగా చరణ్ చేసిన ఇంకో గొప్ప విషయం ఒకటి బయటపడింది. ఆగస్టు 22న ఒక పాప పుట్టింది. ఆ పాప తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆ విషయం తెలిసిన రామ్ చరణ్ స్పెషల్ కేర్ తీసుకొని ట్రీట్మెంట్ కు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక ఆ పాప ఈరోజు డిశ్చార్జ్ కూడా అయిపోయింది. అయితే ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఒక సెలబ్రిటీ ఒక పని చేశాడు అంటే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. కానీ వాటికి దూరంగా చరణ్ చేసిన ఈ పని చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ తరుణంలోని పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్తో హరీష్ శంకర్ రాసుకున్న డైలాగ్ ఒకటి గుర్తుకు వస్తుంది. మనం చేసే పనిలో మంచి కనిపించాలి కాని మనం కనిపించకూడదు అని. ఈ మాటలు ఖచ్చితంగా రామ్ చరణ్ కి సరిపోతాయి.


Tags

Related News

This Week Releases: ఈవారం విడుదల కానున్న సినిమాల సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవే.. కే విశ్వనాథ్ చివరి చిత్రానికి ఎక్కువ కట్స్

Fouji : చాలా పెద్ద ప్లాన్ వేసావ్ కదా హను, మళ్ళీ చాలా ఏళ్లు తర్వాత తెరపైకి ఆ కాంబినేషన్

Devi Sri Prasad: పాపం కన్స్టర్ లుకు కూడా ఇన్వైట్ చెయ్యాల్సిన పరిస్థితి

Sudheer Babu : పాపం 18 సినిమాలు చేస్తే , కేవలం రెండే వర్కౌట్ అయ్యాయి

Vettaiyan OTT : అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్నరజినీకాంత్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Suriya: ఇలా కూడా వర్కవుట్స్ చేయొచ్చా? జిమ్‌లో హీరో సూర్య వీడియో వైరల్

Big Stories

×