Rakul Preet Singh Wedding Soon : రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోనుందా..? ఆమె సోదరుడు అమన్ ఈ విషయం పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రకుల్ ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువ నటించడం లేదు. సరైనోడు, ధృవ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఆమె చివరిగా నటించిన చిత్రం “కొండ పొలం”.
పెళ్లికి సంబంధించి రకుల్ అన్ని ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని.. త్వరలో తెలుగు సినిమాల్లో నటిస్తానని చెప్పింది. నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ డేటింగ్ చేస్తోంది. వీరిద్దకి సంబంధించిన అనేక ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె సోదరుడు అమన్ ప్రకటించడంతో ఈ ముద్దుగుమ్మ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
రకుల్ ఈ పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. “అమన్.. నా పెళ్లి గురించి నాకు తెలియడం లేదు బ్రో.. నాకు కూడా చెప్పాలి కదా” అని రకుల్ సెటైర్ వేసింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రివాలి’, ఇండియన్ 2 సినిమాలతో పాటు.. బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటిస్తోంది.
Leave a Comment