EPAPER

Rajinikanth Vettaiyan: ఆ క్రేజ్ ఏమైపోయింది తలైవా

Rajinikanth Vettaiyan: ఆ క్రేజ్ ఏమైపోయింది తలైవా

Rajinikanth Vettaiyan: సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులు కూడా చాలా దగ్గర అయిపోయారు. అసలు భాషతో సంబంధం లేకుండా రజినీకాంత్ సినిమాలను కూడా చూసిన ఆడియన్స్ ఉన్నారు. రజనీకాంత్ అంటేనే ఒక రకమైన క్రేజ్ అని చెప్పాలి. చాలామందికి రజనీకాంత్ అంటే ఒక ఎమోషన్ అని చెప్పాలి. చాలామంది తెలుగు హీరోలు కూడా రజనీకాంత్ ని ప్రైస్ చేస్తూ ఉంటారు. కమల్ హాసన్ రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒకప్పుడు రజినీకాంత్ చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతూ ఉండేది. మామూలుగా తెలుగు ప్రేక్షకులకి భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూడటం అలవాటు. తెలుగు ప్రేక్షకులు సినిమాలను ప్రేమించిన అంతగా వేరే ఇండస్ట్రీ ప్రేక్షకులు ప్రేమించరు అనేది వాస్తవం.


ఇకపోతే ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలానే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమాకి క్రేజ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది కానీ రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది. ఒక సినిమా రిలీజ్ అవుతున్న కూడా అవుతుంది అని తెలియని పరిస్థితుల్లోకి ఆడియన్స్ వెళ్ళిపోయారు దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. వీటన్నిటినీ మించి సినిమా టైటిల్స్ విషయంలో కూడా మార్పు రావలసి ఉంది అని చెప్పాలి. చాలా తమిళ్ డబ్బింగ్ సినిమాలకు టైటిల్స్ ను అలానే ఉంచి వేస్తున్నారు. తమిళ్ లో ఏ టైటిల్ అయితే ఉందో అదే టైటిల్ను దాదాపు ఫిక్స్ చేస్తున్నారు. దీనివల్ల తెలుగు ఆడియన్స్ కి అసలు సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోతుంది అని చెప్పాలి. ఇదివరకు చాలా తమిళ్ సినిమాల టైటిల్స్ ను అలానే ఉంచేశారు. ఇప్పుడు వెట్టయన్ టైటిల్ విషయంలో కూడా అదే ఎదురవుతుంది అని చెప్పాలి. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న కూడా మినిమం బజ్ లేకుండా పోయింది. అది కూడా రజనీకాంత్ సినిమాకి క్రేజ్ లేకపోవడం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని విషయం. అయితే మొత్తానికి వీటిలో టైటిల్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది అని చెప్పాలి.

ఒకప్పుడు రజినీకాంత్ సినిమా అంటే టికెట్లు దొరకడానికి కూడా కష్టంగా మారేది. కానీ ఇప్పుడు మాత్రం రజనీకాంత్ ప్రముఖ పాత్రలో నటించిన లాల్ సలాం సినిమాకి కూడా పెద్దగా ఆదరణ దక్కలేదు. వీటన్నిటికీ కారణాలు ఆలోచిస్తే ప్రస్తుతం చాలా సినిమాల్లో ఓటీటీ లోకి వచ్చేయడం వల్ల, అలానే తెలుగు సినిమాలు ఎక్కువగా మిగతా ఇండస్ట్రీను డామినేట్ చేయడం వలన డబ్బింగ్ సినిమాలు పైన ఆసక్తి పూర్తిస్థాయిలో తగ్గిపోయింది అని చెప్పాలి. చాలా సినిమాలకు ఇలానే జరిగింది మీకు రాబోయే కంగువ సినిమాకి ఏం జరుగుతుందో వేచి చూడాలి. అక్టోబర్ 10 వ తారీకు కంగువ సినిమా రిలీజ్ అవుతుందని ఇదివరకే అనౌన్స్ చేశారు కానీ రజనీకాంత్ సినిమా ఉండటంతో ఆ సినిమాను కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది


Related News

Swag Collections : షాకిస్తున్న ‘స్వాగ్ ‘ కలెక్షన్స్.. ఎంత రాబట్టాలంటే?

Singer Sunitha: భర్తతో గొడవ పడ్డ సింగర్ సునీత.. కాపురంలో చిచ్చు?

Viswam Censor : శ్రీను వైట్ల కష్టానికి కత్తెర్లు… ఇక ఆ దేవుడే కాపాడాలి

Samantha : నాగ్ కష్టపడుతున్నాడు… సమంత ఎంజాయ్ చేస్తుంది..

Spirit & SSMB29: 2025 లో బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్ కు ముహూర్తం ఖరారు

Kavya Thapar : సినిమా కోసం తొమ్మిది రోజులు ఉపవాసాలు

×