EPAPER

Rajinikanth: డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. కానీ..?

Rajinikanth: డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. కానీ..?

Rajinikanth.. గత మూడు రోజులుగా చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నేడు డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు అపోలో హాస్పిటల్ వైద్య బృందం ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే తమ అభిమాన హీరో డిశ్చార్జ్ అవడంతో ఆయనను నేరుగా కలవడానికి ఎంతో మంది అభిమానులు హాస్పిటల్ దగ్గరికి రావడం ఆయన క్రేజ్ కి నిదర్శనంగా నిలుస్తోంది. ఇకపోతే వారం రోజులపాటు విశ్రాంతి అనడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


అసలేమైందంటే..?

ప్రముఖ డైరెక్టర్ టీ.జే. జ్ఞానవేల్ (T.J.Gnanavel ) దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం వేట్టయాన్. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన దసరా సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగంగా చేపట్టాల్సి ఉంటుంది.. అయితే ఇలాంటి సమయంలో రజినీకాంత్ ను వైద్యులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ సినిమా అయినా సరే సక్సెస్ సాధించాలి అంటే దానికి ప్రమోషన్స్ అనేది తొలి అడుగు పడుతుంది. అందుకే హీరోలు సాధ్యమైనంత వరకు ప్రమోషన్స్ తోనే సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తారు. సినిమా ఎంత బాగున్నా సరే సినిమా ప్రేక్షకులకు రీచ్ అయినప్పుడే దానిని థియేటర్లో చూడడానికి వస్తారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వేట్టయాన్ కి కనిపించడం లేదు. ఎందుకంటే అనారోగ్య పరిస్థితి కారణంగా రజనీకాంత్ ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నారు. మరి సినిమాపై తీసుకొచ్చి చిత్ర బృందం ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయం కూడా అభిమానులలో ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి ఎన్నో విషయాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మరి రజినీకాంత్ సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి ఇంటి నుంచే ప్రమోషన్స్ చేపడతారా అన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది..మరి ఏం జరుగుతుందో చూడాలి.


అర్ధరాత్రి వేళ హాస్పిటల్ లో చేరిన రజినీకాంత్..

ఇదిలా ఉండగా రజినీకాంత్ సోమవారం రోజు అర్ధరాత్రి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో చెన్నైలోనే అపోలో హాస్పిటల్లో చేరారు. ఆయన గుండెకు అనుసంధానించే పెద్ద రక్తనాళం లో వాపు ఏర్పడిందని వైద్యులు గుర్తించారట. దీంతో వెంటనే ట్రాన్స్ కాథెటర్ పద్ధతి ద్వారా శస్త్ర చికిత్స చేసి వాపును మూసివేసినట్లు వైద్యులు ఒక బులెటిన్ కూడా వదిలారు. ఇకపోతే గురువారం రోజే డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి బృందం చెప్పినప్పటికీ ,చికిత్స చేస్తున్న వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు తాజాగా ఈయనను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Roja Movie: ఈ హీరో జీవితంలో ఇంత విషాదమా.. కన్నీరు పెట్టిస్తున్న స్టోరీ..!

Genelia: అర్ధరాత్రి విడాకులు.. నా జీవితంలో ఊహించని పరిణామం..!

HarshaSai: సైబర్ క్రైమ్ లో కంప్లైంట్.. వికృత చేష్టలకు బాధిత యువతి ఎమోషనల్..!

Big Tv Exclusive : RC16 షూటింగ్ కి అంతా సెట్… పూర్తి డీటైల్స్ ఇవే…

Jr. Ntr : ఇక్కడ సినిమాలకు బ్రేక్.. అక్కడ సినిమాలకు గ్రీన్ సిగ్నల్..

Swag Movie Review : ‘శ్వాగ్’ మూవీ రివ్యూ… శ్రీ విష్ణు హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?

Big Stories

×