EPAPER

Rajendra Prasad: అశ్రునయనాల మధ్య ముగిసిన రాజేంద్రప్రసాద్ కూతురి అంత్యక్రియలు.. !

Rajendra Prasad: అశ్రునయనాల మధ్య ముగిసిన రాజేంద్రప్రసాద్ కూతురి అంత్యక్రియలు.. !

Rajendra Prasad.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న రాజేంద్రప్రసాద్ బ్రతికుండగా ఏదైతే చూడకూడదు అనుకున్నారో అదే చూసి మరింత కృంగిపోతున్నారు. తన కూతురు ఆలనా పాలనా చూసుకోవాలని , కూతురి పిల్లలతో ఆడుకోవాలని ఎన్నో కలలు కన్న ఆయనకు ఆ కలలన్నీ దూరమయ్యాయని చెప్పాలి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు నిన్న ఉదయం గుండెపోటుతో మరణించడం ఆయనను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.


ముగిసిన రాజేంద్రప్రసాద్ కూతురి అంత్యక్రియలు..

సినీ ఇండస్ట్రీలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకున్న రాజేంద్రప్రసాద్, ఒక్కసారిగా కూతుర్ని కోల్పోయి కుప్పకూలిపోయారు. కూతురి మరణం జీర్ణించుకోలేకపోతున్న రాజేంద్రప్రసాద్ ను చాలామంది సెలబ్రిటీలు పరామర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా అభిమానులు , సెలబ్రిటీలు , కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి అంత్యక్రియలు ముగిసాయి. కూకట్పల్లి కే.పీ.హెచ్.బీ కాలనీ లోని 7వ ఫేజ్ కైలాస వాసంలో గాయత్రి అంత్యక్రియలు ముగిసాయి. స్వయంగా రాజేంద్రప్రసాద్ కూతురి పాడే మోస్తూ అందరిని కంటతడి పెట్టించేశారు.


న్యూట్రిషన్ గా పేరు తెచ్చుకున్న గాయత్రి..

ఇక రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రీ విషయానికి వస్తే.. గాయత్రికి వివాహం జరిగింది. ఒక కూతురు కూడా ఉంది. ఆ అమ్మాయి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కిన చిత్రం మహానటి లో చిన్ననాటి సావిత్రి పాత్రను పోషించింది. ఇక గాయత్రి భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మరొకవైపు గాయత్రి న్యూట్రిషన్ గా సలహాలు ఇస్తూ కెరియర్ సాగిస్తోంది. ఇకపోతే కూతురి మరణంతో కుప్పకూలిన రాజేంద్రప్రసాద్ కన్నీరు మున్నీరు అవుతున్నారు.

రాజేంద్రప్రసాద్ కెరియర్..

రాజేంద్రప్రసాద్ కెరియర్ విషయానికి వస్తే, సినిమా నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, కమెడియన్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హాస్య చిత్రాలలో హీరోగా నటించి మంచి హాస్యనటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. రాజేంద్రప్రసాద్ నటించిన సినిమాలలో ఏప్రిల్ ఒకటి విడుదల, మాయలోడు, అప్పుల అప్పారావు, అహనా పెళ్ళంట, లేడీస్ టైలర్ వంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన 2015 ఏప్రిల్ లో జరిగిన మా ఎన్నికలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎర్రమందారం సినిమాలో ఉత్తమ నటనకు నంది అవార్డు లభించగా ,మేడం సినిమాతో కూడా నంది అవార్డు దక్కించుకున్నారు. ఆ నలుగురు సినిమాకి కూడా ఉత్తమ నటుడు విభాగంలో నంది అవార్డు లభించింది. ఇక ఈ ఏడాది కల్కి 2898 ఏడి సినిమాలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రజనీకాంత్.. ఏడాది ఉత్సవం, ఆర్టిఐ , లగ్గం, జనక అయితే గనక వంటి చిత్రాలలో నటించారు. ఈ వయసులో కూడా వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రాజేంద్రప్రసాద్ కు కూతురి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పవచ్చు.

Related News

Jani Master: జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ ఇవ్వాలి, ఆ అమ్మాయే అలా చెప్పింది.. నిజాలు బయటపెట్టిన కొరియోగ్రాఫర్

Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

World’s Richest Actor: ప్రపంచంలోనే అత్యంత రిచ్ యాక్టర్ కానీ ఒక్కటే హిట్.. షారుఖ్ కాదు.. ఎవరో తెలుసా?

Tollywood Actress: బాలీవుడ్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్ బ్యూటీస్…

Ranveer Singh: ‘నాన్న’ చైల్డ్ ఆర్టిస్ట్‌ తో రొమాన్స్ చేయనున్న రణవీర్.. ఛిఛీ, సిగ్గుందా?

Samantha: ఫెయిల్యూర్ హీరోయిన్ పై ప్రశంసలు.. అసలు కథ ఏంటంటే..?

×