EPAPER

Rajendra Prasad : మా అమ్మ మళ్లీ చనిపోయింది, పంపించేసి వస్తా.. రమాప్రభతో రాజేంద్ర ప్రసాద్ – కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Rajendra Prasad : మా అమ్మ మళ్లీ చనిపోయింది, పంపించేసి వస్తా.. రమాప్రభతో రాజేంద్ర ప్రసాద్ – కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. హీరోగా, సపోర్ట్ రోల్ చేస్తూ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.. తన కామెడితో ప్రేక్షకులను నవ్వించే ఆయన ఇంట్లో రెండు రోజుల క్రితం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కార్డియాక్‌అరెస్ట్‌ కావడంతో నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు.. ఆమె మరణం నటుడు కుటుంబానికి తీరని లోటు అని తెలిసిందే. కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాజాగా ఆయనకు సంబందించిన ఓ ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఆ వీడియోను చూసిన అభిమానులు, సన్నిహితులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మా అమ్మ మళ్లీ చనిపోయింది.. పంపించేసి వస్తాను అని పరామర్శించేందుకు వచ్చిన రమాప్రభ, మరికొందరు మహిళా నటులతో ఆయన చెబుతూ భావోద్వేగానికి గురైయ్యాడు.. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో చూసిన వారంతా ఆయనకు ధైర్యం చెబుతున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..

ఇక ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్రప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీదే చెప్పేయడం ఆయన నైజం.. రాజేంద్ర ప్రసాద్ పరసనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవ్వరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు.. గతంలో ఓ సినిమా ఈవెంట్ లో తన కూతురు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. నా పదేళ్ల వయసలు మా అమ్మ గారు చనిపోయారు. నేను కూడా నా కూతురిలో అమ్మను చూసుకున్నా.. కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు.. ఆమె ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగుసార్లు వినిపించాను అని అన్నారు రాజేంద్రప్రసాద్.. ఇప్పుడు కన్న కూతురు గుండెపోటుతో చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు.


Related News

Akkineni Nagarjuna: దానికి పవనే అవసరం లేదు.. ఆయన ఫ్యాన్స్ చాలు

IIFA awards 2024: ఉత్తమ నటుడిగా యంగ్ హీరో.. మరో ఫీట్ అందుకోనున్నారా..?

Prakash Raj: చీప్ రాజకీయాలు.. తిరుపతి లడ్డూ వివాదాన్ని వదలని ప్రకాష్ రాజ్

Sudheer Babu: అప్పుడు మంచు మనోజ్, ఇప్పుడు వరుణ్ తేజ్.. యంగ్ హీరోలను టార్గెట్ చేస్తున్న సుధీర్ బాబు

Rajinikanth: రజినీకాంత్ జోక్యం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Singham Again Trailer: పోలీస్ రామాయణం.. రావణుడు మాత్రం హైలైట్ అంతే..

×