EPAPER

Rajanikanth: రజనీకాంత్ కు పెను ప్రమాదమే తప్పింది.. ఊపిరి పీల్చుకున్న ‘కూలీ’ యూనిట్

Rajanikanth: రజనీకాంత్ కు పెను ప్రమాదమే తప్పింది.. ఊపిరి పీల్చుకున్న ‘కూలీ’ యూనిట్

Rajanikanth Coolie movie shooting spot near blast in container terminal: 2025 మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో ఒకటి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. గత పదేళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ కు తిరిగి పునర్‌వైభవం తెచ్చేలా జైలర్ మూవీ వచ్చింది. మళ్లీ భాషా మూవీ కాలం నాటి ఎనర్జీని చూపిన రజనీకాంత్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. కోలీవుడ్ చరిత్రలోనే బ్లాక్ బస్టర్ విజయం అది. అంతకు ముందు కమల్ హాసన్ విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి పాన్ ఇండియా సినిమాల రికార్డులన్నీ జైలర్ ముందు కొట్టుకుపోయాయి. తెలుగు రాష్ట్రాలలోనూ జైలర్ మంచి విజయమే సాధించింది. ఇండియా మొత్తం మీద ఓవరాల్ గా రూ.600 కోట్లు సాధించి రజనీకాంత్ హవా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. అందరూ ఇక రజనీకాంత్ పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో ఏడు పదుల వయసులో రజనీ జైలర్ గా అదరగొట్టేశారు.


లోకేష్ కనగరాజ్ దర్శకత్వం

ఇక రజనీకాంత్ నటుడిగా 170 సినిమాలు చేశారు. రజనీకాంత్ చుట్టూ ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు క్యూకడుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీకి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ లుక్ అన్నీ కూలీ మూవీపై అంచనాలు విపరీతంగా పెంచేశాయి. గోల్డ్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది. ఓ సాధారణ కూలీ గోల్డ్ మాఫియాను ఎలా ఎదుర్కున్నాడో చూపించే మూవీ. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిలింతో తన కెరీర్ మొదలుపెట్టారు. 2021లో విజయ్ దళపతి హీరోగా మాస్టర్ మూవీ రిలీజయింది. దీనికి దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాకూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. 2023లో విజయ్ దళపతి హీరోగా వచ్చిన లియో సినిమాకూ లోకేష్ కనగరాజ్ దర్వకుడు. లోకేష్ సినిమాలలో సినిమాటిక్ యూనివర్స్ విధానం కనిపిస్తుంది. ఒక సినిమాలో పాత్ర మరొక సినిమాతో లింక్ ఉంటుంది. ఈ విధానాన్ని ఇండియన్ స్క్రీన్ పై తెచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఎక్కువగా యాక్షన్ జానర్ లో సినిమాలు తీస్తుంటారు.


Also Read: దెయ్యాలను వదిలేసి రీమేక్ లు ఎందుకు బ్రో..?

విశాఖ పోర్టులో షూటింగ్

రజనీకాంత్ కు జైలర్ తో వచ్చిన ఇమేజ్ కారణంగా లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కూలీ సినిమాకు సంబంధించిన వర్క్ జోరుగా జరుగుతోంది. గత పది రోజులుగా విశాఖపట్నం పోర్టు లో నిరవధికంగా కూలీ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ కూలీ సినిమాకు సంబంధించి భారీ సెట్లు వేశారు. కూలీ సినిమా సెట్ కు కాస్త దూరంలో హఠాత్తుగా కంటైనర్ బ్లాస్ట్ అయింది. చైనా నుండి వచ్చిన లోడ్ కోల్ కతాకు లోడింగ్ జరుగుతుండగా హఠాత్తుగా కంటైనర్ టెర్మినల్ లో భారీ విస్ఫోటనం జరిగింది. దీనితో టెర్మినల్ సిబ్బంది భయాందోళనలతో బయటకు పరిగెత్తారు. అయితే ప్రమాద సంఘటన జరిగిన కొద్ది దూరంలోనే కూలీ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే కూలీ సినిమా సెట్లు ఏమీ డ్యామేజ్ కాలేదు. అగ్నిప్రమాదం మరింత భారీగా జరిగివుంటే షూటింగ్ సిబ్బంది కి అందులో ఉన్న రజనీకాంత్ కు పెద్ద ప్రమాదమే జరిగివుండేది. ఇక తమ అభిమాన నటుడికి ఏ ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు. పోలీసులు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×