EPAPER

Rajamouli: రాజమౌళికి రమా అలాంటి కండీషన్.. రాత్రిళ్లు ఆ పని చేయాల్సిందే.. షాక్ లో ఫ్యాన్స్..!

Rajamouli: రాజమౌళికి రమా అలాంటి కండీషన్.. రాత్రిళ్లు ఆ పని చేయాల్సిందే.. షాక్ లో ఫ్యాన్స్..!

Rajamouli.. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. శాంతినివాసం అనే సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. అద్భుతమైన కథ రాసుకొని స్క్రిప్ట్ పట్టుకొని ఎంతోమంది హీరోల చుట్టూ తిరిగినా ఎవరూ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. చివరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) నమ్మి అవకాశం ఇచ్చారు. అలా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రాజమౌళి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.


తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు..

ఇక రాజమౌళి పనితనం చూసిన మిగతా హీరోలు కూడా రాజమౌళికి అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ప్రభాస్, సునీల్, నాని , రామ్ చరణ్ , రవితేజ ఇలా చాలా మంది హీరోలు రాజమౌళికి అవకాశాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు రాజమౌళి ఒకరి కోసం ఎదురు చూడడమే కాదు రాజమౌళి కోసమే హీరోలు ఎదురు చూసేలా చేసుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి, ప్రపంచ స్థాయి గుర్తింపు అందించారు. ముఖ్యంగా తెలుగు సినిమాలతో ప్రపంచానికి తెలుగు వాళ్ళు అంటే ఏంటో నిరూపించారు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న రాజమౌళి, ఇంట్లో మాత్రం కొంగుచాటు మొగుడే. సినిమా ఇండస్ట్రీలో ఆయన చెప్పిందే రూల్. కానీ ఇంట్లో మాత్రం భార్య పెట్టిన రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనట.


ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఇంటి పనులు చేయాల్సిందే..

ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ ను సైతం సాధ్యం చేసిన రాజమౌళి.. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఇంట్లో మాత్రం సాధారణ భర్త అని చెప్పవచ్చు. సమాజంలో భార్యల వద్ద భర్తలు ఎలా అయితే ఉంటారో.. తాను కూడా అలాగే ఉంటారట. అంతేకాదు ఇంకా చాలామంది చేయని పనులు కూడా చేస్తూ ఉంటారు రాజమౌళి. అందులో భాగంగానే రాజమౌళి తన భార్య రమా రాజమౌళి చెప్పిన మాట కచ్చితంగా వింటారట. ఈ విషయంలో మాత్రం సినిమా ఇమేజ్ ఏది పనిచేయదట. షూటింగ్ లేని సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పనులు కూడా చేస్తారట రాజమౌళి. ఫ్రీగా ఉన్నప్పుడు ఇల్లు తుడవడం, అంట్లు కడగడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారట.

రమా కండీషన్ కి కట్టుబడిన రాజమౌళి..

అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మరో పని కచ్చితంగా చేస్తారట రాజమౌళి. ఈ విషయంలో ఒక అగ్రిమెంట్ మీద రమా రాజమౌళి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. సినిమాలు తీసే సమయంలో అంటే షూటింగ్ సమయంలో భార్య రమా.. రాజమౌళి కాళ్లు నొక్కాలి.. షూటింగ్ లేని సమయంలో రాజమౌళి.. తన భార్య రమా కాళ్లు నొక్కాలాట. ఇలా ఒప్పందం ప్రకారం ఇద్దరు ఉంటారని రాజమౌళి తెలిపారు. అయితే ఈ విషయంలో రమా రూల్ బ్రేక్ చేసినా.. తాను మాత్రం ఖచ్చితంగా తన భార్య కాళ్ళు నొక్కుతానని తెలిపారు రాజమౌళి ..ఏది ఏమైనా ఎంత పెద్ద గొప్ప డైరెక్టర్ అయినా భార్య పై ప్రేమను చూపిస్తూ మరొకసారి ఇంకా ఎత్తుకు ఎదిగారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Related News

Lavanya tripathi: తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి..?

Naga Vamsi: ఆ తప్పే గుంటూరు కారం సినిమాకి మైనస్.. నిర్మాత హాట్ కామెంట్స్..!

Harihara Veeramallu: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. త్వరలో ఫస్ట్ సింగిల్..!

Alia Bhatt: ‘జిగ్రా’ కలెక్షన్స్ అంతా ఫేక్, ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారు.. ఆలియా భట్‌పై హీరోయిన్ అటాక్

Aliabhatt : ఆ వింత సమస్యతో ఇబ్బంది పడుతున్న అలియాభట్..?

Dulquer Salmaan: నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. హీరో షాకింగ్ స్టేట్‌మెంట్

Big Stories

×