EPAPER
Kirrak Couples Episode 1

Rajamouli – Prashanth: జక్కన్నకు.. ప్రశాంత్ నీల్ కు మధ్య తేడా అదే..

Rajamouli – Prashanth: జక్కన్నకు.. ప్రశాంత్ నీల్ కు మధ్య తేడా అదే..

Rajamouli – Prashanth: ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ సలార్ మానియా కనిపిస్తోంది. తెరపైన చిత్రాన్ని నడిపించింది ప్రభాస్ అయితే తెర వెనక మూవీ హైలైట్ అయ్యేలా చేసింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా ఇతని పేరు టాలీవుడ్ లో కూడా మారుమోగుతోంది. ప్రభాస్ మాస్ యాక్షన్ విశ్వరూపాన్ని అద్భుతంగా తెరపై ఎక్కించడంలో ప్రశాంత్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో పలు రకాల అంశాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.


వాటిలో ఒకటి బాహుబలి డైరెక్టర్ కు, సలార్ డైరెక్టర్ కు మధ్య ఉన్న తేడాని పోల్చడం. జక్కన్న గురించి ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు వరల్డ్ వైడ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. బాహుబలి మూవీతో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో వరల్డ్ వైడ్ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి డైరెక్టర్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బేరేజీ వేయడంలో ప్రభాస్ అభిమానులు బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో సలార్ లో కాస్త స్టోరీ పరంగా కన్ఫ్యూజన్ ఉంది అంటున్నారు అభిమానులు.

కే జి ఎఫ్ చిత్రంతో కన్నడ ఇండస్ట్రీకి మంచి క్రేజ్ తెచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ . ఈ ఇద్దరి డైరెక్టర్స్ కి ఎంతో ప్రతిభ ఉంది ..కానీ ఇద్దరి మధ్య చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అంటున్నారు సినీ పండితులు. సినిమాలోని పాత్రలను.. వాటి చుట్టూ తిరిగి కథను పరిచయం చేయడంలో ఇంతటి మధ్య చాలా తేడా మనం గమనించవచ్చు. సినిమా రిలీజ్ కి ముందు నుంచే కథతో పాటుగా పాత్రలను మెల్లిగా ప్రేక్షకులకు పరిచయం చేయడం రాజమౌళి స్టైల్. బాహుబలిలో చాలా రాజ్యాల పేర్లు కొత్తగా ఉన్నాయి. ఆయినా వాటిని చిన్న ఆడియన్స్ కి పరిచయం చేయడంలో రాజమౌళికి వంద శాతం సక్సెస్ సాధించాడు.సరైన రీతిలో సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం ద్వారా స్టోరీ పై మంచి అవగాహన తెప్పించడమే కాకుండా.. ఇంట్రెస్ట్ నెలకొల్పాడు.


అయితే ప్రశాంత్ నీల్ మాత్రం మన్నార్లు, శౌర్యంగాలు, ఘనియార్లను పరిచయం చేయడంలో కాస్త ఫెయిల్ అయ్యాడు. సినిమా రిలీజ్ వరకూ అందరికీ కేవలం ఖాన్సార్ ప్రపంచం మాత్రమే తెలుసు. సెకాండాఫ్ లో కొత్తగా మూడు తెగలను పరిచయం చేయడంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు.. ఇదే రాజమౌళి, ప్రశాంత్ నీల్ మధ్య ఉన్న స్పష్టమైన తేడా అని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే స్టోరీ జక్కన్న తీసి ఉంటే.. తెగల విషయం కాస్త సింపుల్ గా.. ఆడియన్స్ కు బాగా అర్థమయ్యేలా ముందే పరిచయం చేసేవాడని వాళ్లు భావిస్తున్నారు. ఇంకా మూవీ లో ఎమోషన్ పండించడంలో ప్రశాంత్ నీల్ తో పోలిస్తే రాజమౌళి చాలా బెటర్ అని కూడా చెబుతున్నారు. కానీ ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ స్టైల్ ఒకే లాగా ఉండదు కదా.. అందుకే ఎవరినీ వేరే డైరక్టర్ తో పోల్చలేమని మరి కొంత మంది అంటున్నారు.

Related News

Janhvi Kapoor : సపోర్టింగ్ క్యారెక్టర్ కు ఎక్కువ, ఐటం గర్ల్ కి తక్కువ… ఈమాత్రం దానికే అంత బిల్డప్ ఇచ్చారా?

Devara Movie : ‘దేవర’ కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే?

Devara : హద్దులు దాటిన అభిమానం… దేవర కోసం టోక్యో నుంచి లాస్ ఎంజిల్స్ కు వచ్చిన డై హార్డ్ ఫ్యాన్

Devara : ఋణపడి ఉంటా… దేవర రెస్పాన్స్ కు ఉబ్బితబ్బివుతున్న ఎన్టీఆర్

Khushboo: లడ్డూ వివాదంపై ఖుష్బూ ఊహించని కామెంట్స్.. ఇరుక్కోబోతోందా..?

Kiraak RP: ఓయో లో బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన ఆర్పీ భార్య.. కట్ చేస్తే.!

Devara Audience Reaction : తారక్ ఎర్ర సంద్రంపై తాండవం… ఆడియన్స్ రియాక్షన్ ఇదే..

Big Stories

×