EPAPER

PVR Cinimas: సినీ ప్రియులకు బంఫరాఫర్.. రూ.699తో నెల మొత్తం సినిమాలు చూసేయొచ్చు..!

PVR Cinimas: సినీ ప్రియులకు బంఫరాఫర్.. రూ.699తో నెల మొత్తం సినిమాలు చూసేయొచ్చు..!

PVR Cinimas: కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు సినీ ప్రియులు థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తారు. అదీగాక తమ ఫేవరెట్ హీరో సినిమా అయితే వారి హంగామాకు అంతే ఉండదు. టికెట్ రేటు వేలల్లో ఉన్నా.. కొనుక్కోని మరీ సినిమా చూడాలనుకుంటారు. కానీ ఫ్యామిలీతో వెళ్లాలనుకునే వారు మాత్రం కాస్త ఆలోచిస్తుంటారు.


సినిమా రిలీజైన రెండు మూడు వారాల వరకూ టికెట్ రేట్లు తగ్గవు. దీంతో వారు కాస్త ఆలోచించి థియేటర్‌కి వెళ్లే బదులు.. కొద్దిరోజులు ఓపిక పడితే ఓటీటీలో చూసేయొచ్చని ఆలోచిస్తుంటారు. అలాంటి వారందరి కోసం ప్రముఖ థియేటర్ సంస్థ పివిఆర్ బంపరాఫర్ ప్రకటించింది. కేవలం తక్కువ మొత్తంతోనే నెలంతా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ మేరకు ప్రేక్షకుల కోసం మూవీ పాస్ విధానాన్ని తీసుకువస్తుంది. కేవలం రూ.699 లకే నెలంతా సినిమాలు చూసే అవకాశాన్ని కలిపిస్తుంది. అయితే ఈ విధానం నార్త్‌లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. సౌత్‌లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ పాస్‌తో నెలకు దాదాపు 10 సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే అక్కడే ఓ కండీషన్ ఉంది.ఈ పాస్‌తో కేవలం సోమవారం నుంచి గురువారం రోజుల్లో మాత్రమే సినిమా చూసే అవకాశం ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ పాస్ చెల్లదు. ఇప్పటికే పాస్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన పనులు మొదలైనట్లు తెలుస్తోంది.


ఈ పాస్‌లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై PVR సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను PVR సంస్థ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ పాస్‌కు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ పీరియడ్ కేవలం మూడు నెలల వ్యవధి మాత్రమే కలిగి ఉంటుంది.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×