Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ ( Sukumar ) కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమా పుష్ప.. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని బన్నీ ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాను ఎట్టకేలకు డిసెంబర్ 5 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేసారని టాక్.. కానీ తెలుగు రాష్ట్రాల్లో లేదని తెలుస్తుంది. అసలు మ్యాటరేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అతి తక్కువ రోజులు ఉండటంతో షూటింగ్ పనులు త్వరలోనే ముగించుకొని ప్రమోషన్స్ మొదలు పెట్టాలానే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.. అందులో భాగంగా ‘పుష్ప 2’ ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌ను బీహార్ పాట్నాలో ఉంటుందని సమాచారం. ఆ తరువాత ఉత్తరాదిన పుష్ప 2 సినిమా కోసం ముంబై ఢిల్లీతో పాటు బిహార్ యుపి, పంజాబ్ రాజస్థాన్, వెస్ట్ బెంగాల్‌లో సైతం అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.. కేవలం నార్త్ లోని మెయిన్ సిటీస్ లలో మాత్రమే ఈవెంట్ ను నిర్వహించాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తెలుగు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
మెయిన్ నార్త్ ఆడియన్స్‌ను టార్గెట్ చేశారని టాక్. గతంలో వచ్చిన యాక్షన్ మూవీ పుష్ప కు నార్త్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఎక్కువగా అక్కడే ప్రమోషన్స్ చెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కొద్ది రోజులు మాత్రం ఉంది. అయితే మూవీలో ఇంకా రెండు పాటలు, ఓ సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఇందులో ఐటెమ్ సాంగ్ కీలకం. ఆ పాటకు ఇప్పటి దాకా హీరోయిన్ సెట్ కాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల అంగీకరించింది అన్న వార్తలు హల్‌చల్ చేశాయి కానీ.. అధికారిక ప్రకటన లేదు. విడుదల తేదీ దగ్గర పడుతుంది. కానీ ఇంకా పాటల చిత్రీకరణ ఓ కొలిక్కి రాలేదు. మరి ఇంత తక్కువ టైమ్ లో సుకుమార్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.. ఈ సినిమా పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి.. ఈ సినిమా పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి.. జాతర సాంగ్ తర్వాత సినిమాను ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు… అల్లు అర్జున్ లైఫ్ లో ఏ సినిమాకు లేని బడ్జెట్ ను ఈ మూవీకి కేటాయిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.. సినిమాను ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు..