EPAPER
Kirrak Couples Episode 1

Prithviraj : ఆ సినిమాకు ముందు నాకు అవకాశాలు లేవు, ప్రస్తుతం 23 సినిమాలు చేస్తున్నాను

Prithviraj : ఆ సినిమాకు ముందు నాకు అవకాశాలు లేవు, ప్రస్తుతం 23 సినిమాలు చేస్తున్నాను

Prithviraj : కొన్నిసార్లు కొన్ని అవకాశాలు కెరియర్ లో ఎంత దూరం తీసుకెళ్తాయో, ఎంత మంచి అవకాశలను తీసుకొస్తాయి ప్రత్యేకంగా మనం ఊహించలేము. ఒకప్పుడు సీనియర్ హీరోలుగా చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ ప్రతిభను నిరూపించుకున్నారు. అందులో జగపతిబాబు, శ్రీకాంత్, పృధ్విరాజ్ వంటి నటులు కూడా ఉన్నారు. జగపతిబాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జగపతిబాబు సినిమాలకి చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అలానే శ్రీకాంత్ సినిమాలకు కూడా మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఉండేవాళ్ళు. చాలా తెలుగు సినిమాల్లో కనిపించిన కూడా దేవుళ్ళు సినిమాలో పాత్ర పృధ్విరాజ్ మంచి పేరుని తీసుకొచ్చింది.


ఇక చాలా మంది సీనియర్ హీరోలు ఇప్పుడు నటులుగా కూడా తమ ప్రతిభను చూపిస్తున్నారు. దాదాపు జగపతిబాబు కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన లెజెండ్ సినిమాలో పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసాడు జగపతిబాబు. ఈ ఫ్యామిలీ హీరో ఒక్కసారిగా టాప్ విలన్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. విలన్లు లేరు అనుకునే టైంలో జగపతిబాబు ఒక ఆరాల నిలుచుని ఆ లోటుని కప్పిపుచ్చాడు అని చెప్పొచ్చు. ఎటువంటి పాత్రలోనైనా కూడా అవలీలగా ఇమిడిపోయి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు. రంగస్థలం, అరవింద సమేత వంటి సినిమాలు దీనికి నిదర్శనం. ఇక రీసెంట్ గా శ్రీకాంత్ కూడా హీరోగా సినిమాలు చేయటం మానేసి నటుడుగా తన ప్రతిభను చూపిస్తున్నారు.

23 సినిమాలతో బిజీ


ఇక సీనియర్ నటిల్లో పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు తన కెరియర్ పూర్తి అయిపోయింది అనుకునే తరుణంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అనిమల్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఆ సినిమాలు పృథ్వీరాజ్ నటించిన తీరు సినిమాకి మంచి ప్లస్ అయింది. పృధ్విరాజ్ ని సందీప్ రెడ్డి వంగ చూపించిన విధానం కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. దాదాపు కెరియర్ అయిపోయింది అనుకునే తరుణంలో అనిమల్ సినిమా ప్రస్తుతం పృథ్విరాజ్ కి వరుసగా అవకాశాలను తీసుకొస్తుందట. ప్రజెంట్ ఒక 23 సినిమాలకు పృథ్వీరాజ్ పని చేస్తున్నట్లు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అదే సందీప్ వంగ ప్లస్ పాయింట్

ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ ఒక సినిమాను బాగా తీస్తాడు అని చాలామంది చెబుతారు, కానీ దానితో పాటు సందీప్ రెడ్డికి మ్యూజిక్ మీద, సినిమా కాస్టింగ్ మీద గాని ఒక మంచి నాలెడ్జ్ ఉంది అని చెప్పాలి. అనిమల్ సినిమాల్లో కొంతమంది నటులు కనిపించని చిన్న పాత్రలే అయినా కూడా అవి చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటాయి. అలానే పృథ్వీరాజ్ పాత్ర కూడా ఆ సినిమాకి వర్కౌట్ అయింది. మళ్లీ కెరియర్ లో పృథ్వీరాజ్ ను బిజీ చేసింది.

Related News

Kirak RP : ఆర్పీ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు…

Devara: నిలబడింది తారక్ , కానీ నిలబెట్టింది అనిరుధ్

Devara 2 : దేవర పార్ట్ 2 తెరకెక్కితే ఇవి తెలియాలి

Rajamouli Sentiment : ఇంతకీ రాజమౌళి హీరో సెంటిమెంట్ బ్రేక్ అయిందా.?

Amaran: మేజర్ భార్యగా సాయి పల్లవి.. ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

Koratala Siva: అసలు ఏమి స్కోప్ ఉందని “దేవర” పార్ట్ 2 అనౌన్స్ చేశారు

Big Stories

×