EPAPER

Jai Hanuman Update: ‘జై హ‌నుమాన్‌’లో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Jai Hanuman Update: ‘జై హ‌నుమాన్‌’లో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Hanuman Sequel: టాలీవుడ్‌లో కొందరు దర్శకులు రొటీన్ స్టోరీలకు స్వస్థిపలికి డిఫరెంట్ కాన్సెప్ట్‌లపై ఫోకస్ పెడుతున్నారు. అలా కొత్త కథకు కాస్త విజువల్ ఎఫెక్ట్స్‌ జతకలిపి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నారు. అందులో ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ ఒకటి. ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌కు సూపర్ హీరో స్టోరీని యాడ్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా అత్యద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోయింది.


అంతేకాకుండా దర్శకుడి టేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. అంతేకాకుండా ఇందులో హీరోగా నటించిన తేజ సజ్జ తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుని నిర్మాతల పంట పండించింది. అంతేకాకుండా ఎన్నో రికార్డులను సైతం హనుమాన్ సినిమా బద్దలు కొట్టింది.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ సీక్వెల్ ప్రకటించాడు. ఈ సారి ‘జై హనుమాన్’తో వస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే ఈ జై హనుమాన్‌లో మెయిన్ హీరోగా తేజ సజ్జ కాకుండా ఓ స్టార్ హీరోతో తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. ఎవరా స్టార్ హీరో అంటూ తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


Also Read: ఐమ్యాక్స్ 3డి వెర్షన్‌లో ‘జై హనుమాన్’.. డ్రాగన్స్‌తో హనుమంతుడి ఫైట్.. పోస్టర్ అదుర్స్!

ఈ సీక్వెల్‌లో రాముడిగా మహేశ్ బాబును, హనుమంతుడిగా చిరంజీవిని తన మనసులో అనుకున్నట్లు తెలిపాడు. దీంతో ఆ మధ్య దర్శకుడి వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్‌ గురించి నిర్మాత చైతన్య రెడ్డి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సీక్వెల్ మూవీలో హనుమంతుడి పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి లేదా రామ్ చరణ్‌లను అనుకుంటున్నట్లు తెలిపారు.

ఆ పాత్ర కోసం ఇంకా వారిని సంప్రదించలేదని.. త్వరలోనే వారిని కలిసి ఈ విషయం పై చర్చిస్తామని అన్నారు. అయితే ఆ పాత్ర కోసం తగ్గ నటుడిని హనుమంతుడే డిసైడ్ చేస్తాడని.. ఆ నిర్ణయాన్ని హనుమంతుల వారికే వదిలేస్తున్నామని తెలిపారు. కాగా వారు సినిమా కంటే దేవుడి కథ చెప్పాలని అనుకుంటున్నారని.. అందువల్ల దాన్ని ఎలా చెప్పించుకుంటారనేది హనుమంతుడి ఇష్టం అని నిర్మాత చైతన్య రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో చైతన్య రెడ్డి వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చిరంజీవి అని పర్వాలేదు.. రామ్ చరణ్ అయినా పర్వాలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

Harsha Sai: దేశం విడిచి పారిపోయిన హర్ష సాయి.. అక్కడి నుండే అవన్నీ మ్యానేజ్

Posani Krishna Murali: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు, అమ్మాయిలు ఒప్పుకోరు.. పోసాని కృష్ణ‌ముర‌ళి కామెంట్స్

Maa Nanna Super Hero Trailer: కంటే తండ్రి అయిపోరు.. ఎమోషన్‌తో ఏడిపించేసిన సుధీర్ బాబు

×