EPAPER

Prashant Neel: డంకి చిత్ర యూనిట్ కి క్షమాపణలు చెప్పిన ప్రశాంత్ నీల్

Prashant Neel: డంకి చిత్ర యూనిట్ కి క్షమాపణలు చెప్పిన ప్రశాంత్ నీల్

Prashant Neel: ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు. కే జి ఎఫ్ (Kgf ) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక దర్శకుడుగా మంచి గుర్తింపు ప్రశాంత్ కి లభించింది. అంతకుముందు కన్నడ సినిమా అంటే పెద్దగా పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు కేజీఎఫ్ సినిమా తర్వాత ఆ సినిమాలు కూడా చూడటం మొదలుపెట్టారు. అలా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన కాంతారా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది.


కే జి ఎఫ్ సినిమాతో మార్క్ సెట్ చేశాడు

ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమా చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక సినిమాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎంతలా ఎలివేట్ చేయొచ్చు ఈ సినిమా లో చూపించాడు ప్రశాంత్. అలానే తల్లి కొడుకులు మధ్య ఎమోషన్ కూడా పీక్ లో చూపించాడు. తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే ఒక మాస్ కమర్షియల్ సినిమాను తన పంథాలో చూపించాడు. ఈ సినిమా తర్వాత సీక్వెల్ గా కే జి ఎఫ్ టు (KGF 2) అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సంగా హిట్టై దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.


ప్రభాస్ కి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు

ఇకపోతే ప్రశాంత్ ని తెలుగు హీరోలను కూడా లైన్ లో పెట్టాడు. బాహుబలి ( Baahubali) సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సాధించుకున్నాడు ప్రభాస్ (Prabhas). ఆ సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కి గురయ్యాయి. ఇక ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ కి మంచి కం బ్యాక్ అయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు అంచనాలకు రీచ్ అయిపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా కూడా సినిమా రానున్నట్లు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. ఈ సినిమా ను డిసెంబర్ నెలలో రిలీజ్ చేశారు. వాస్తవానికి అదే టైంలో రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వం వహించిన డంకి (Dunki) సినిమా కూడా రిలీజ్ అయింది. సలార్ సినిమా ప్రభంజనంలో ఆ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఈ తరుణంలో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ మాట్లాడుతూ డంకి చిత్ర యూనిట్ కి తన క్షమాపణలు తెలియజేశారు. సలార్ కంటే ముందే డంకీ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేశారని, డిసెంబర్లో సలార్ (Salar) సినిమా వచ్చే ప్లాన్ లేకపోయినా కూడా కొన్ని కారణాల వల్ల రావాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేశారు.

Also Read : Lokesh Kanagaraj : ప్రతి డైరెక్టర్ మిగతా సినిమాలను కూడా సపోర్ట్ చేయాలి

Related News

Sharda Sinha Death: పద్మభూషణ్ గ్రహీత కన్నుమూత.. శోకసంద్రంలో ఇండస్ట్రీ..!

Rana Daggupati : రానాకు ఘోర అవమానం.. హీరోయిన్ వల్ల పరువు మొత్తం పాయే..

Pushpa2 : ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. తెలుగు రాష్ట్రాల్లో లేనట్లే..?

Anchor Pradeep Marriage : అధికార కూటమి పిల్లనే పడేశాడు..? ప్రదీప్ నువ్వు నెక్స్ట్ లెవెల్ అయ్యా బాబు..

Pawan kalyan – Allu Arjun : పుష్ప 2 రిలీజ్ కు ముందే పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ భేటీ..?

Allu Arjun : పుష్పరాజ్ అనేది రియల్ సామి.. రీల్లో కూడా ఇలాగే ఉంటారా?

Big Stories

×