Prabhas’s Spirit Movie : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన రోజుకో పుకారు షికార్లు చేస్తోంది. తాజాగా ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే క్రేజీ రూమర్ ఒకటి బయలుదేరింది. మరి ఆ రూమర్ ఏంటంటే…
సందీప్ రెడ్డి వంగ ‘యానిమల్’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ పట్టాలెక్కడం లేట్ అవుతోంది. కాగా ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా కనిపిస్తారని సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రభాస్ ఈ సినిమాలో కేవలం పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు మరో కీ రోల్ కూడా చేయబోతున్నారని తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది.
ముందు పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత స్టోరీలోని ఊహించని మతిపోయే ట్విస్ట్ ల తర్వాత గ్యాంగ్ స్టర్ గా మారుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలోని పలు వైల్డ్ ఎలిమెంట్స్ యాక్షన్ ప్రియుల్ని ఆకట్టుకుంటాయని, థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు. మూవీ ఇంకా కనీసం సెట్స్ పైకి వెళ్ళకముందే ఈ రేంజ్ లో రూమర్లు రావడం చూస్తుంటే సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అర్థమవుతుంది.
కాగా ఈ సినిమాలో మొట్టమొదటిసారి ప్రభాస్ ఖాకీ దుస్తులు ధరించబోతున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’ (Spirit) సినిమాను టి సిరీస్ భూషణ్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది అని మొదటి నుంచి టీం చెప్తూనే ఉంది. ఇదిలా ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగ భారీ క్రాస్ ఓవర్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఆయన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఒక సంచలనం. ఆ తర్వాత ఇదే సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో తీసి అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇక రీసెంట్ గా ‘యానిమల్’ మూవీతో మోస్ట్ వైలెంట్ మూవీని తీసి మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే గతంలో సందీప్ రెడ్డి వంగా తను చేసిన సినిమాల హీరోలను ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో కూడా చూపించాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇక మరోవైపు ‘స్పిరిట్’ సినిమాలో స్టార్ హీరోను విలన్ గా నటింపజేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది.