EPAPER

Prabhas Rejected Movies: ప్రభాస్ రిజెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు.. రెబెల్ స్టార్ లెక్క తప్పిందా?

Prabhas Rejected Movies: ప్రభాస్ రిజెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు.. రెబెల్ స్టార్ లెక్క తప్పిందా?

Prabhas Rejected Movies: ప్రభాస్‌కు కథ వినిపించడానికి ఎంతోమంది దర్శకులు వచ్చారు. కానీ అప్పుడు పలు కారణాల వల్ల ఆ సినిమాలు వర్కవుట్ అవ్వలేదు. రెబెల్ స్టార్ లెక్క తప్పడంతో తన ఖాతాలో నుండి పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి. అవేంటో చూసేయండి


ఒక్కడు

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్కడు’ మూవీ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఫేవరెట్‌గా నిలిచిపోయింది. కానీ ముందుగా ఈ కథను ప్రభాస్, కృష్ణంరాజులకు వినిపించాడట గుణశేఖర్. పలు కారణాల వల్ల ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ప్రభాస్ చేతికి వెళ్లలేదు.


దిల్

అప్పటివరకు ఫ్యామిలీ సినిమాలతోనే అలరించిన నితిన్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘దిల్’. ముందుగా ఈ కథను ప్రభాస్‌కు వినిపించాడు. తను కూడా ఓకే అనుకున్నాడు. కానీ ప్రభాస్ వేరే సినిమాతో మిస్ అవ్వడంతో ‘దిల్’ మిస్ అయ్యింది.

సింహాద్రి

రాజమౌళి సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగించిన మూవీ ‘సింహాద్రి’. ఇలాంటి మాస్ సినిమాను ఎన్‌టీఆర్‌తో కాకుండా ప్రభాస్ గానీ, బాలయ్యతో గానీ చేయాలని అనుకున్నారట రాజమౌళి. కానీ పలు కారణాల వల్ల అవి వర్కవుట్ అవ్వక ఎన్‌టీఆర్ చేతికి వెళ్లింది.

Also Read: 17 ఏళ్ల తర్వాత నయన్‌తో డార్లింగ్ రొమాన్స్.. మారుతి రొమాంటిక్ ప్లాన్ ఇదే..

ఆర్య

అల్లు అర్జున్ హీరోగా పరిచయం అవ్వగానే ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఆ ట్రోల్స్ అన్నింటిని ‘ఆర్య’తో దూరం చేశాడు బన్నీ. కానీ ముందుగా ప్రభాస్‌తోనే ఈ మూవీ చేద్దామనుకున్నాడట సుకుమార్. ‘ఆర్య’ అనేది పూర్తిస్థాయి లవ్ స్టోరీ కావడంతో తన ఇమేజ్‌కు సెట్ అవ్వదని రిజెక్ట్ చేశాడట ప్రభాస్.

బృందావనం

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మున్నా’ మూవీ చేశాడు ప్రభాస్. అది డిశాస్టర్‌గా నిలిచింది. దీంతో ‘బృందావనం’ కథతో మరోసారి ప్రభాస్ దగ్గరకు వెళ్లాడట వంశీ. కానీ అప్పటికే ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండడంతో ‘బృందావనం’ ఎన్‌టీఆర్ చేతికి వెళ్లింది.

నాయక్

ఎంతోమంది స్టార్ హీరోలకు గుర్తుండిపోయే మాస్ హిట్స్ ఇచ్చిన వీవీ వినాయక్.. ప్రభాస్‌కు మాత్రం ‘యోగి’ అనే ఫ్లాప్ ఇచ్చాడు. అందుకే ‘నాయక్’తో మరోసారి ప్రభాస్‌ను ఒప్పించాలని చూసినా అప్పటికీ తను బిజీగా ఉండడంతో అదే కథను రామ్ చరణ్‌తో చేశాడు.

కిక్

మాస్ మహారాజ్ రవితేజ సినిమాల్లో ‘కిక్’ ఒక స్పెషల్ మూవీ. కానీ ముందుగా ఈ సినిమా కథను ప్రభాస్‌కు వినిపించాడట సురేందర్ రెడ్డి. పలు కారణాల వల్ల ప్రభాస్‌తో ఇది వర్కవుట్ అవ్వకపోవడంతో ఎన్‌టీఆర్‌తో కూడా ట్రై చేశాడట. చివరికి ఈ కథ రవితేజ చేతికి వెళ్లి బ్లాక్‌బస్టర్ అయ్యింది.

ఊసరవెళ్లి

‘కిక్’ వర్కవుట్ అవ్వకపోవడంతో ‘ఊసరవెళ్లి’ కథతో ప్రభాస్‌ను ఒప్పించడానికి ప్రయత్నించాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. అప్పుడు కూడా పలు కారణాల ఈ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో వర్కవుట్ అవ్వలేదని అప్పట్లో టాలీవుడ్‌లో వార్తలు వినిపించాయి.

డాన్ శీను

గోపీచంద్ మలినేని ‘డాన్ శీను’ కథను ప్రభాస్ కోసమే రాసుకున్నాడట. ఆ సినిమాను ప్రభాస్‌తోనే చేయాలని కూడా అనుకున్నాడట. కానీ అప్పటికే ‘బుజ్జిగాడు’ సినిమాలో అలాంటి పాత్రలోనే నటించడంతో ‘డాన్ శీను’ను రిజెక్ట్ చేశాడట రెబెల్ స్టార్.

Also Read: డార్లింగ్ గురించి ఎవరికీ తెలియని 10 రహస్యాలు ఇవే..!

జిల్

‘బాహుబలి’తో బిజీగా ఉండడంతో, రాజమౌళికే కమిట్మెంట్ ఇవ్వడంతో అయిదేళ్లలో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు ప్రభాస్. అందులో రాధాకృష్ణ కుమార్ చేసిన ‘జిల్’ కూడా ఒక్కటి. అప్పుడే ఈ దర్శకుడికి మాటివ్వడంతో తనతో కలిసి ‘రాధే శ్యామ్’ చేశాడు ప్రభాస్.

Related News

Kanguva First Review : “కంగువ” ఫస్ట్ రివ్యూ… మూవీ టాక్ ఏంటంటే?

Ka Movie: ట్రైలర్ బావుంది.. కానీ, కిరణ్ అబ్బవరంకే లక్ లేదు..?

Pushpa 2 Remuneration : పుష్పగాడి రేంజే వేరబ్బా.. అందుకే అన్ని రూ.కోట్లు..!

Ka Movie Trailer : చీకటి వలయం… గందరగోళం… సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న ట్రైలర్..!

Sai Pallavi : ఆ హీరోలు అందరూ ఉనికిని కోల్పోతారు… సాయి పల్లవి నుంచి షాకింగ్ కామెంట్స్..!

Raja Saab : ప్రభాస్ తాత గెటప్ వెనుక ఇంత కథ ఉందా.. మారుతి ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Tripti Dimri : యానిమల్ బ్యూటి చేసిన మొదటి యాడ్?..అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..

Big Stories

×