EPAPER

Raja Saab : టైం చూసి దిగుతున్న’ రాజా సాబ్ ‘..కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

Raja Saab : టైం చూసి దిగుతున్న’  రాజా సాబ్ ‘..కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

Raja Saab : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్, ఈ ఏడాది కల్కి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడం మాత్రమే కాదు. బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ చేసేలా కలెక్షన్స్ కొల్లకొట్టాయి. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు డార్లింగ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకవైపు విమర్శలు అందుకున్నా మరోవైపు సినిమా సరికొత్తగా ఉండబోతుందని ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక ఈ సినిమా నుంచి మొన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


‘రాజా సాబ్’ మూవీ..

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న హర్రర్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’. రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్ గా ఓ సర్ప్రైజ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. ‘సింహాసనం తనకు చెందిన వ్యక్తి కోసం వెయిట్ చేస్తోంది…’ అంటూ ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో చూపించారు. ప్రభాస్ రాజసం ఉట్టిపడే రాయల్ లుక్ లో, కొంచం భయంకరంగా, మరింత కొత్తగా కనిపించారు.. ఈ సినిమా సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ లుక్ లో కనిపిస్తున్నాడు. మొదట రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చూపించిన యంగ్ క్యారెక్టర్‌ ఒకటైతే.. ఇక లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లో కనిపించిన మహా రాజు క్యారెక్టర్. ఇలా హీరో పాత్రను రెండు రకాలుగా చూడగానే జనాలకు చంద్రముఖి, నాగవల్లి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.. మరి సినిమా ఆ రేంజ్ లో ఉంటుందో చూడాలి..


సమ్మర్ లో రాజా సాబ్.. రిలీజ్ డేట్ లాక్?

రాజా సాబ్ సినిమా పై ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ జనాలు మాత్రం ఈ సినిమా పై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ లుక్ జనాలకు సరిగ్గా రీచ్ అవ్వలేదని టాక్.. ఈ మూవీ స్టోరీ కన్ఫ్యూజన్ గా ఉందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మోషన్ పోస్టర్ భారీ హైప్ ను అయితే క్రియేట్ చేసింది. అనుకున్నట్లు గానే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా లాక్ చేసుకుంది. ఏప్రిల్ 10, 2025 న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఎక్కువ టైం తీసుకునేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక సాంగ్స్ పై అప్డేట్ ను త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా కల్కి రికార్డ్ లను బ్రేక్ చేస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మరి తన రికార్డ్ ను తానే బ్రేక్ చేస్తాడేమో చూడాలి..

Related News

35 chinna katha kaadu: అరుదైన గౌరవం అందుకున్న 35 చిన్న కథ కాదు..!

Pragathi: ఆ నటుడు అసభ్యకరంగా తాకాడు.. ప్రగతి ఎమోషనల్ కామెంట్స్..!

Ustaad Bhagat Singh: తేరి రీమేక్ కాదు.. ఆ పోలికలు ఉండటం వల్లే మిస్ కమ్యునికేషన్

Unstoppable With NBK : అప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్లే చేసిన స్ట్రాటజీ ఇప్పుడు సిబిఎన్ కు కూడా చేస్తుంది

Fauji Movie : భారీ ధరకు ‘ ఫౌజీ ‘ డిజిటల్ రైట్స్.. ఇది ప్రభాస్ రేంజ్.. !

5 Years Of Kaithi : సరిగ్గా ఐదేళ్ల క్రితం, లోకేష్ కనకరాజ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది

Kanguva: సూర్యతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తున్న మెగా హీరో

Big Stories

×