EPAPER

Prabhas: ప్రభాస్ కి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో తెలుసా.. ఇప్పటికీ చెరగని గుర్తు..!

Prabhas: ప్రభాస్ కి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో తెలుసా.. ఇప్పటికీ చెరగని గుర్తు..!

Prabhas : బాహుబలి (Bahubali )సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అందులో భాగంగానే ఏడాది కల్కి 2898AD (Kalki 2898AD) సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు రాజాసాబ్ , స్పిరిట్, సలార్ -2, కల్కి- 2, ఫౌజీ వంటి చిత్రాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఇక నిన్న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజా సాబ్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉండగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ప్రభాస్ మొబైల్ స్క్రీన్ సేవర్ పై ఆయన ఫోటో..

ప్రభాస్ తన మొబైల్ స్క్రీన్ సేవర్ గా ఎవరి ఫోటో పెట్టుకున్నారు అని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూడగా.. తాజాగా ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. తాజాగా ప్రభాస్ తన మొబైల్ స్క్రీన్ సేవర్ పైన తన తండ్రి అలాగే తన తల్లి, తాను కలిసి దిగిన ఫోటోని స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఫొటో నే.. తండ్రి పైన ఇష్టంతోనే ఆ ఫోటోని అలాగే ఆయన కంటిన్యూ చేస్తున్నట్లు సమాచారం. ఆ ఫోటో చూసిన ప్రతిసారి తనకు తన తండ్రి పక్కనే ఉన్నాడన్న భావన తనకు కలుగుతుందట. ఆ కారణంగానే ప్రభాస్ తండ్రి మనమధ్య లేకపోయినా తన తండ్రి తన పక్కనే ఉన్నాడంటూ ఫీలవుతూ ఆ ఫోన్ స్క్రీన్ సేవర్ ను మార్చలేదంట ప్రభాస్. ఈ ఒక్క విషయం చాలు ప్రభాస్ కి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి.


ప్రభాస్ వంటకాలు అంటే తన తల్లికి చాలా ఇష్టమట..

ఇక ప్రభాస్ కి తన తల్లి అంటే కూడా అంతే ఇష్టం. ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో .. తన తల్లికి తన చేతితో పెట్టిన కాఫీ అంటే చాలా ఇష్టమని,అలాగే తాను వేసిన ఆమ్లెట్ అంటే ఇంకా ఇష్టమని ప్రభాస్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తన తండ్రి పై ఉన్న ప్రేమను ఇలా చాటుతూ తండ్రి చాటు కొడుకుగా పేరు సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఇక ప్రభాస్ తల్లిదండ్రులు విషయానికి వస్తే.. సూర్యనారాయణ రాజు (Suryanarayana Raju), శివకుమారి (Shiva Kumari)దంపతులకు జన్మించారు ప్రభాస్. ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు నిర్మాతగా కొనసాగే వారు. ఇకపోతే కొన్ని కారణాలవల్ల 2010 ఫిబ్రవరి 12న ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణం తర్వాత ప్రభాస్ తల్లి శివకుమారి మీడియా ముందుకు చాలావరకు రాలేదని చెప్పవచ్చు. ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) మన మధ్య లేకపోయినా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి (Shyamala Devi) అందరికీ సుపరిచితురాలు.

Related News

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Laggam Movie Review : ‘లగ్గం’ మూవీ రివ్యూ

Chiranjeevi : 28న చిరుకు అక్కినేని పురస్కారం… ఎవరి చేతుల మీదు గానో తెలుసా..?

RajaSaab: ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.. తాతమనవడు.. ఇంకా.. ?

Kannappa : శివయ్యా… నీపైనే భారమంతా… కేదారనాథ్ యాత్రలో కన్నప్ప టీం..

Suriya: టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ్ హీరో.. బాగానే ప్లాన్ చేశాడుగా..?

Big Stories

×