EPAPER

Prabhas: షాకింగ్ నిర్ణయం తీసుకున్న డార్లింగ్.. దర్శక నిర్మాతలకు చిక్కులు తప్పవా..?

Prabhas: షాకింగ్ నిర్ణయం తీసుకున్న డార్లింగ్.. దర్శక నిర్మాతలకు చిక్కులు తప్పవా..?

Prabhas.. నేడు తెలుగు సినిమా సత్తా గ్లోబల్ స్థాయి కి చేరింది అంటే దానికి కారణం రాజమౌళి, ప్రభాస్ అనే చెప్పాలి. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో.. ఆ తర్వాత చిత్రాలన్నీ కూడా సత్తా చాటుతూ.. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తూ తెలుగు సినిమాకు మరింత గుర్తింపును అందిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల మార్కెట్ కూడా ఈ చిత్రాల ద్వారానే పెరిగిపోయింది. బాక్సాఫీస్ కలెక్షన్లకు తగ్గట్టుగా బడ్జెట్ ఉంటుంది. ఒకప్పుడు రూ.100 కోట్లతో సినిమా అంటే అమ్మో అని అనుకునేవారు. అయితే ఇప్పుడు మినిమం రూ.300 కోట్లు పెట్టాల్సిందే. ఇక మాక్సిమం హీరో మార్కెట్ పైన, నిర్మాత బడ్జెట్ పైన ఆధారపడి ఉంటుంది.


షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్..

మరోవైపు పాన్ ఇండియా చిత్రాలు చేసి కాసుల సునామీ సృష్టిస్తున్న అగ్ర హీరోలు కూడా సరికొత్త రికార్డులు కూడా నెలకొల్పుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టైర్ -1 హీరోలే కాకుండా టైర్ -2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా చిత్రాలు.. హీరోలకు ఇప్పుడు అవరోధాలుగా మారుతున్నాయనే చెప్పాలి. ఒకప్పుడు ప్రతి హీరో నుండి కూడా కనీసం రెండు సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత ఏడాదికి ఒక సినిమా రావడం కూడా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కూడా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. అంతేకాదు దర్శక నిర్మాత కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఏడాదికి రెండు సినిమాలు..

అసలు విషయంలోకి వెళ్తే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కాలి అంటే కనీసం మినిమం సంవత్సరం పడుతుంది. అప్పటికి కంప్లీట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. సినిమా తెరకెక్కించడం ఒక వంతు అయితే.. వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రమోషన్స్ కోసం ఇంకా ఎంతో సమయం పడుతుంది. ఇప్పుడు ఒక మూవీ ఓవరాల్ గా కంప్లీట్ అయ్యి ఆడియన్స్ ముందుకు రావడానికి సుమారుగా రెండు నుండి మూడు సంవత్సరాలు పడుతుంది. బాహుబలి 2 విషయంలో కూడా ఇదే జరిగింది. 2016లో విడుదలవాల్సిన సినిమా కాస్త 2017లో విడుదలైంది. రిజల్ట్ వచ్చింది, పేరు కూడా వచ్చింది కానీ ఐదేళ్లలో ప్రభాస్ నటించింది కేవలం రెండు చిత్రాలలో మాత్రమే. మిగిలిన హీరోలు మాత్రం అదే సమయంలో రెండు మూడు సినిమాలు తో ఆకట్టుకుంటుంటే, పాన్ ఇండియా చిత్రాల కారణంగా ప్రభాస్ ఐదేళ్లలో కూడా రెండు చిత్రాలలోనే నటించడం ఆశ్చర్యకరం.

ఇబ్బంది పడుతున్న దర్శక నిర్మాతలు..

సినిమాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో హీరోలకు – అభిమానులకు మధ్య బాండింగ్ కూడా తగ్గిపోతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇదే డార్లింగ్ కు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. అందుకే ఏడాదికి రెండు సినిమాలతో ఆకట్టుకుంటానని అభిమానులకు ప్రామిస్ చేశారట ప్రభాస్. అందుకు తగ్గట్టుగానే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. సాధారణంగా ప్రభాస్ తో సినిమా అంటే షూటింగ్ కి ఏడాది పడుతుంది. స్టార్ కాస్ట్ , షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇంకా టైం పట్టవచ్చు. ఏడాదికి ఒక సినిమా కూడా రావడం కష్టమే.. కానీ దర్శక నిర్మాతలకు కండిషన్స్ పెడుతూ.. 90 రోజుల్లోనే ఒక్కో సినిమా పూర్తి అయ్యేలా చూడాలని చెబుతున్నాడట. మొత్తానికైతే ఏడాదికి రెండు మూడు సినిమాలను విడుదల చేస్తానని ప్రామిస్ చేసిన ప్రభాస్.. ఈ కారణంగా అటు దర్శకనిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Game Changer: కొత్త డేట్ తో వచ్చేసిన గేమ్ ఛేంజర్.. ఇక పూనకాలే

RAPO22: మహేష్ బాబుతో రామ్ సినిమా.. ఈసారి హిట్ ఖాయమే.. ?

Allu Arjun: గొడవపై క్లారిటీ.. మెగావార్ ముగిసినట్టేనా..?

Alia Bhatt: రాహా కపూర్‌కు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్, చూడగానే షాకయిన ఆలియా భట్.. అదేంటో తెలుసా?

Unstoppable Season 4 Trailer: జై బాలయ్య.. దెబ్బకు థింకింగ్ మారి తీరాలా.. ట్రైలర్ అదిరిపోయింది

Tollywood Heroine: ముగ్గురు హీరోల జీవితాలలో నిజమైన స్టార్ హీరోయిన్ సెంటిమెంట్.. క్రేజీ కదా..!

Tollywood Hero’s: ఈసారైనా ఈ హీరోలు గట్టెక్కేరా..?

Big Stories

×