EPAPER

Pottel Movie : రివ్యూయర్స్ ని బండ బూతులు తిట్టిన శ్రీకాంత్ అయ్యంగార్

Pottel Movie : రివ్యూయర్స్ ని బండ బూతులు తిట్టిన శ్రీకాంత్ అయ్యంగార్

Pottel Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వారానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఏ సినిమా ఇప్పుడు ఎలాంటి విజయం సాధిస్తుందో ఎవరు ఊహించలేరు. ఒకవేళ అదే తెలిసినట్లయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కేవలం హిట్ సినిమాలు మాత్రమే వస్తాయి. అలానే అందరికీ అన్ని సినిమాలు నచ్చాలని రూల్ కూడా లేదు. బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన గుండమ్మ కథ, సుమంగళి, బడిపంతులు, మూగమనసులు వంటి సినిమాలు కూడా నచ్చని ప్రేక్షకులు ఉన్నారు. శంకరాభరణం లాంటి సినిమాలో కూడా తప్పొప్పులు వెతికే మేధావులు ఉన్నారు. కానీ ఆ మేధావులు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువయ్యారు అని చెప్పాలి. ఇదే రివ్యూవర్స్ అప్పుడు ఉండుంటే ఆయా సినిమాలు బయటికి రాకుండా అయిపోయేవి. ప్రేక్షకులు ఆలోచన విధానాల్లో మార్పు వచ్చింది. ఒక సినిమాని సినిమాగా చూడటం అలవాటు చేసుకోవడం మర్చిపోయి, ఆ సినిమాలోని తప్పొప్పులు వెతకడం అనేది అలవాటైపోయింది.


ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ తర్వాత సవారి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడు ఇచ్చాడు సాహిత్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ని సాధించలేకపోయింది. కానీ సాహిత్య మాత్రం ఒక దర్శకుడుగా మంచి మార్కులు పడ్డాయి. రీసెంట్ గా సాహిత్ పొట్టేలు అని ఒక సినిమా చేశాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్గా మంచి టాక్ సంపాదించింది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ ని ఎత్తి చూపిస్తూ కొంతమంది దారుణంగా ట్రోల్ కూడా చేశారు. అయితే వీటి పైన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ (Srikanth Iyangar) స్పందించాడు. రివ్యూవర్స్ ఆన్ స్టేజ్ పై బండ బూతులు తిట్టడం మొదలుపెట్టారు ఈ కల్చర్ పోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. జీవితంలో షార్ట్ ఫిలిం తీయని నా కొడుకులు వచ్చి సినిమా రివ్యూ రాస్తాడు అంటూ ఫైర్ అయ్యాడు.

శ్రీకాంత్ అయ్యంగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలో కనిపించాడు. ఇక ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినిమాల్లో ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటారు. శ్రీకాంత్ థాట్ ప్రాసెస్ కూడా దాదాపు రాంగోపాల్ వర్మ కి దగ్గరగానే ఉంటుందని చెప్పాలి. ఇకపోతే శ్రీకాంత్ పోట్టేలు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు. నటుడు అజయ్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా చూసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఏకంగా రంగస్థలం సినిమాతో కూడా ఈ సినిమాను పోల్చాడు సందీప్. అయితే అటువంటి సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఈ విధమైన కామెంట్స్ చేశాడు శ్రీకాంత్ అయ్యంగర్. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Related News

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

×