EPAPER

Pottel Movie Review : ‘పొట్టేల్’ మూవీ రివ్యూ

Pottel Movie Review : ‘పొట్టేల్’ మూవీ రివ్యూ

చిత్రం : పొట్టేల్
విడుదల తేదీ : 25 అక్టోబర్ 2024
నటీనటులు: అనన్య నాగళ్ల , యువ చంద్ర కృష్ణ, అజయ్, నోయల్ తదితరులు
మ్యూజిక్: శేఖర్ చంద్ర
ప్రొడ్యూసర్: సురేశ్ కుమార్ సడిగే, నిశాంక్ రెడ్డి కుడితి
డైరెక్టర్, స్క్రీన్ ప్లే : సాహితీ మోత్కుర్


Pottel Movie Review Rating : 2.25/5

Pottel Movie Review : ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి అయినా ప్రమోషన్ సరైన విధంగా జరగాలి. లేదు అంటే మొదటి షోలకే ఫలితాలు తారుమారు అయిపోతాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకి ప్రమోషన్ చాలా ముఖ్యం. చిన్న సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తేనే జనాలు థియేటర్లకు వస్తారు. లేదు అంటే అసలు ఆ సినిమాలను పట్టించుకోరు. ఆ రకంగా చూసుకుంటే.. ఈ మధ్య కాలంలో గట్టిగా ప్రమోట్ చేసిన చిన్న సినిమాగా ‘పొట్టేల్’ ని చెప్పుకోవాలి. యువ, అనన్య నాగళ్ళ జంటగా నటించిన ఈ సినిమాలో అజయ్ విలన్ గా చేశాడు. టీజర్, ట్రైలర్స్ లో అతనే హైలెట్ అయ్యాడు.అలాగే విజువల్స్ కూడా చాలా క్వాలిటీగా అనిపించాయి. మరి కంటెంట్ పరంగా కూడా ‘పొట్టేల్’ సినిమా క్వాలిటీగా ఉందా? ప్రేక్షకులని మెప్పించిందా? అనే విషయాలు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


కథ :
1980 ల టైంలో పటేల్ వ్యవస్థ దౌర్జన్యాలా గురించి చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ కథల్లో నుండి పుట్టినదే ఈ ‘పొట్టేల్’. తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్..లకి బోర్డర్ లో ఉండే ‘గుర్రం గట్టు’ అనే ఊరు. ఆ ఊరిలో బాలనాగమ్మ పూనే పటేల్ వంశం. ఆ వంశానికి చెందిన వాడు పటేల్(అజయ్). అతనికి తన కులస్థలు కాకుండా వేరే కులస్థులు చదువుకోవడం, తమ కుటుంబీకుల పక్కన కూర్చోవడం అస్సలు నచ్చదు. అతని దుర్బుద్ధి వల్లే అనుకుంట.. అతని వంశీయులనందరినీ ఆవహించి బాల నాగమ్మ.. ఇతన్ని ఆవహించదు. మరోపక్క చదువు రాకపోవడం వల్ల తన చిన్న కొడుకుని పోగొట్టుకున్న మేకల కాపరి తన పెద్ద కొడుకు గంగాధర్(యువ చంద్ర) ని చదివించాలని అనుకుంటాడు. దీనికి పటేల్ అనుమతి కోసం వెళ్తే.. కొట్టి చంపేస్తాడు. అయితే బాలమ్మ పొట్టేల్ ని కాపలా కాపరిని కొట్టి చంపాడు అని తెలిస్తే ఊర్లో జనాలు ఏకమై తనని చంపేస్తారేమో అని భావించి.. బాల నాగమ్మ ఆవహించినట్టు నటిస్తాడు పటేల్. ఈ విషయం గంగాధర్ ఊర్లో జనాలకి చెప్పినా వాళ్ళు నమ్మరు. అందరూ అతన్ని పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. కానీ బుజ్జమ్మ(అనన్య నాగళ్ళ) మాత్రం అతని మాట నమ్ముతుంది. తర్వాత అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరికీ ఓ పాప పుడుతుంది. ఆ పాపని ఎలాగైనా చదివించాలని గంగాధర్ ప్రయత్నిస్తాడు. ఈ విషయం పటేల్ కి తెలిసిపోతుంది. ఆ తర్వాత పటేల్ వల్ల గంగాధర్ కుటుంబానికి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
దర్శకుడు సాహిత్ మోత్కూరి తీసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. గతంలో పలు సినిమాల్లో చూసినదే. అతని మొదటి సినిమా ‘సవారి’ తో మంచి రైటర్ గా ప్రూవ్ చేసుకున్నప్పటికీ దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు. ఈసారి దర్శకుడిగా సక్సెస్ అవ్వాలని గట్టిగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను ‘పొట్టేల్’ కోసం తీసుకున్న టెక్నికల్ టీం మనసు పెట్టి పనిచేశారు. కానీ ఎక్కువగా ఇతను సీనియర్ దర్శకు తేజ టేకింగ్ ను అడాప్ట్ చేసుకున్నట్టు ఉన్నాడు. ‘జయం’ ‘నిజం’ ‘ఔనన్నా కాదన్నా’ వంటి సినిమాల్లో ఉండే భయంకరమైన వయొలెన్స్ ఈ ‘పొట్టేల్’ లో కూడా కనిపించింది. అజయ్ నటన, పాత్ర కొత్తగా అద్భుతంగా ఉంటాయని మొదటి నుండి కలరింగ్ ఇచ్చారు. కానీ అతని క్యారెక్టరైజేషన్ ‘లక్ష్మీ కళ్యాణం’ లో ఉన్నట్టే ఉంటుంది. ఇలా తేజ రిఫరెన్స్ లు.. ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర పనితనం బాగుంది. ‘నగిరో’ ‘ఈశ్వర’ వంటి పాటలు మెప్పిస్తాయి. నిర్మాణ విలువలకి కూడా వంక పెట్టలేం. ప్రొడక్షన్ డిజైన్ బాగానే ఉంది.

నటీనటుల విషయానికి వస్తే.. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అజయ్ పాత్ర రొటీన్ గానే ఉంది కానీ.. ఆకట్టుకుంటుంది. హీరో యువ అక్కడక్కడా బాగానే చేశాడు. అనన్య నాగళ్ళ ఒక లిప్ లాక్ సీన్ తో తాను గ్లామర్ రోల్స్ కి, ఇంటిమేట్ సీన్స్ కి రెడీ అనే సిగ్నల్ ఇచ్చింది. నటన పరంగా కొత్తగా చేసింది ఏమీ లేదు. నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటీనటులు తమ మార్క్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ప్లస్ పాయింట్స్ :

క్లైమాక్స్
టెక్నికల్ వాల్యూస్
అజయ్

మైనస్ పాయింట్స్ :

కథనంలో వేగం లోపించడం
ఫస్ట్ హాఫ్

మొత్తంగా.. ఈ ‘పొట్టేల్’ లో పై పైన మెరుపులు తప్ప.. అంచనాలకి తగ్గ రేంజ్లో ఏమీ మెప్పించే ఎలిమెంట్స్ లేవు. పబ్లిసిటీకి టెంప్ట్ అయితే తప్ప.. పనిగట్టుకుని థియేటర్లో చూసే సినిమా ఏమీ కాదు.

Pottel Movie Review Rating : 2.25/5

Related News

Tripti Dimri : యానిమల్ బ్యూటి చేసిన మొదటి యాడ్?..అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..

Naga Vamshi : ఆ హీరోల పరువు అడ్డంగా తీసేసిన నిర్మాత.. నమ్మించి ముంచడం అంటే ఇదే..

Balayya : ఇదెక్కడి పిచ్చి మామా .. బాలయ్య పండక్కి సెలవు కావాలట..!

Love Reddy: థియేటర్లో నటుడిపై మహిళ దాడి..ఇంత వైలెంట్ ఏంటి భయ్యా..

Mokshagna: వారసుడు కోసం వారసురాళ్లే కావాలా.. వర్మ.. ?

Ka Movie: అసలే హైప్ లేదంటే.. ఇంకా లేట్ చేయండి.. ఉన్న ఉత్సాహం కూడా పోతుంది

Sudigali Sudheer: వాళ్లే నన్ను బ్యాడ్ చేస్తున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్

Big Stories

×