EPAPER

Pottel Controversy : క్యాస్టింగ్ కౌచ్ పై అనన్యకు ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిల్మ్ ఛాంబర్ కంప్లయింట్

Pottel Controversy : క్యాస్టింగ్ కౌచ్ పై అనన్యకు ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిల్మ్ ఛాంబర్ కంప్లయింట్

Pottel Controversy : ఇటీవల కాలంలో పలువురు జర్నలిస్టులు ఈవెంట్లలో హీరో హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా ప్రశ్నించడం అన్నది ట్రెండ్ గా మారింది. తాజాగా అనన్య నాగళ్ల (Ananya Nagalla) హీరోయిన్ గా నటించిన కొత్త సినిమా ‘పొట్టేల్’ (Pottel) ఈవెంట్లో ఇలాంటి ఒక కాంట్రవర్సీనే చోటు చేసుకుంది. అయితే ఎప్పటిలా ఆ ప్రశ్నపై వాదించి అక్కడితోనే వదిలేయక తాజాగా ఫిలిం ఛాంబర్ కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్ళింది పరిస్థితి.


అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ‘పొట్టేల్’ (Pottel) అనే రూరల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపావళి కానుక రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఆ తర్వాత మీడియాతో క్వశ్చన్ అవర్ నిర్వహించగా… అందులో ఓ లేడీ జర్నలిస్ట్ ‘తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటేనే భయపడతారు, ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది. మరి మీకు ఇలాంటి అనుభవం ఎదురయిందా?’ అని డైరెక్ట్ గా ప్రశ్నించింది. ‘మీకు ఎలా తెలుసు?’ అని అన్నని ప్రశ్నించగా… ‘నాకు మా ఫ్రెండ్స్ చెప్పారు. మీరు చేసే అగ్రిమెంట్లలో కూడా అది ఉంటుందట కదా?’ అని మళ్లీ తిరిగి ప్రశ్నించింది సదరు జర్నలిస్ట్. అయితే ‘ఎక్కడైనా పాజిటివ్ నెగిటివ్ అనేవి ఉంటయి, ఇది 100% తప్పు. నటిగా నాకు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదురవలేదు’ అని చెప్పుకొచ్చింది.

అయితే అక్కడితో ఆగకుండా ‘కమిట్మెంట్ ను బట్టి పారితోషకం ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది’ అని మరో ప్రశ్న అడగ్గా… ‘నేను ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను. మీరు విన్న మాటలు చెబుతున్నారు. కానీ ఇక్కడ అది లేదు’ అంటూ గట్టిగానే బదులిచ్చింది అనన్య. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా ‘పొట్టేల్’ (Pottel) ప్రెస్ మీట్ లో అనన్య పై క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్నలు సందించిన మహిళా జర్నలిస్ట్ పై తాజాగా ఫిలిం ఛాంబర్ జర్నలిస్ట్ సంఘానికి లేఖ రాసింది.


ఇలాంటి జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూనే సదరు జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ విషయాలను ఎలా చెప్పగలిగిందని ప్రశ్నించారు. అలాంటిదేమైనా ఉంటే ఆధారాలతో సహా ఛాంబర్ కు సమర్పిస్తే రహస్యంగా విచారణ జరిపిస్తామని హామీ కూడా ఇచ్చారు.. అయితే ఒకవేళ ఆధారాలు లేకపోతే ఆ జర్నలిస్ట్ పై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ డిమాండ్ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మొత్తానికి మరోసారి జర్నలిస్టులు సెలబ్రిటీలను ఇలాంటి ఈవెంట్స్ లలో ఎలాంటి ప్రశ్నలు పడితే అలాంటివి అడగకుండా గట్టిగానే చర్యలు తీసుకుంటుంది ఫిలిం ఛాంబర్. అయితే ఇప్పుడు ఆ లేడీ జర్నలిస్ట్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉందని ఒప్పుకున్నారు. అలాంటిది ఆ ప్రశ్నలు అడిగిందనే రీజన్ తో మహిళా జర్నలిస్ట్ వ్యాఖ్యలను ఇలా వివాదాస్పదం చేయడం సమంజసం కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Lucky Baskhar : ‘పార్టీ ఇస్తా’… నాగ వంశీ ఈ సినిమాకు కూడా స్టార్ట్ చేశాడు

Lucky Baskhar Trailer: సిగరెట్, ఆల్కహాల్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ.. అందుకే తప్పు తప్పదు!

The Raja Saab : రాజా సాబ్ కాదు రాజా ది గ్రేట్… ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్

Kanguva : పేరుకే యాక్షన్ సినిమా.. ఆ సాంగ్ లో మాత్రం బూతులే బాబోయ్..

Manchu Lakshmi: మంచు లక్ష్మి మంచి మనసు.. మరో 50 స్కూళ్లు దత్తతు

Amjad Habib: హైదరాబాద్‌లో మరో అమ్జద్ హబీబ్ సెలూన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా శ్రద్ధా దాస్

Big Stories

×