EPAPER

Posani Comments on Jr Ntr : ఏదో ప్రాస కోసం మాట్లాడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర అడ్డంగా బుక్కైన పోసాని..

Posani Comments on Jr Ntr : ఏదో ప్రాస కోసం మాట్లాడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర అడ్డంగా బుక్కైన పోసాని..
Posani Comments on Jr Ntr

Posani Comments on Jr Ntr : నంది అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి ఏపీలో రంగం సిద్ధం చేయడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో 1964వ సంవత్సరం నుంచి ఇస్తున్న ఈ నంది అవార్డ్స్ ప్రతి సంవత్సరం తెలుగు సినిమాకి ఇచ్చే పురస్కారాలు. అయితే ఇవి ఇవ్వడం మొదలుపెట్టిన తొలి రోజుల్లో సంవత్సరానికి షుమారు 25 నుంచి 30 సినిమాలు విడుదల అయ్యేది అయితే వాటి సంఖ్య ఎప్పుడు గణనీయంగా పెరిగింది. వాటికి తగ్గట్టే నంది అవార్డులను కూడా పెంచుతూ వస్తున్నారు.


ఈ నేపథ్యంలో నంది అవార్డులు కేవలం ఉత్తములు, అర్హులు అయిన అభ్యర్థులకు మాత్రమే అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నటుడు పోసాని కృష్ణమురళి చెప్పడం జరిగింది. అయితే ఈసారి డ్రామా ,టీవీ ,సినిమా రంగాలకు ఒకేసారి అవార్డులు ఇవ్వడం సాధ్యపడకపోవచ్చు.. కాబట్టి మొదట పద్యనాటకాలకు అందించిన తర్వాత మిగతా రంగాలకు అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ఈ నేపథ్యంలో నంది అవార్డుల పోటీలకు గాను 38 మంది ఎంపికయ్యారని తెలుపుతూ.. వీరికి సంబంధించినటువంటి ఫైనల్ పోటీలను గుంటూరులో నిర్వహించబోతున్నట్లు ప్రకటించాడు పోసాని. అలాగే ఈసారి జరుగుతున్న అవార్డు ఎంపికల విషయంలో ఎటువంటి విమర్శలకు చోటు ఇవ్వకుండా ఉండడం కోసం 12 మంది జడ్జిలను నియామకం చేయడం జరిగిందట. పైగా ఈ సంవత్సరం నుంచి ఎన్టీఆర్ రంగస్థలం అవార్డును కూడా ఇవ్వనున్నట్లు పోసాని తెలియపరిచారు. ఈ అవార్డు గ్రహించిన వారికి అవార్డుతో పాటు ఒకటిన్నర లక్ష బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది.


అలాగే వైయస్సార్ రంగస్థలం పురస్కారం కూడా అందివ్వనున్నట్లు ప్రకటించిన పోసాని ఈ పురస్కారానికి నగదు బహుమతి ఐదు లక్షల వరకు ఇవ్వనున్నట్లు చెప్పారు. మరొకక వైయస్సార్ రంగస్థలం పురస్కారం ఇవ్వడంపై వివరణ ఇస్తూ.. రంగస్థలం ని ప్రోత్సహించడం కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో పాటు పడ్డారని చెప్పుకొచ్చాడు పోసాని. ఈ క్రమంలో 2004లో సీఎం అయిన తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి రంగ స్థలాన్ని ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేశాడు.

ఇక అక్కడితో ఆగకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిబద్ధతను కూడా ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సీఎంతో స్వయంగా చర్చలు కూడా జరిపారని గుర్తు చేశారు. ఇక సినిమా షూటింగులపై కనీసం 20 శాతం వరకు పన్ను రాయితీలు ఇస్తామని సీఎం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించాడు.

ఇక అవార్డుల విషయంలో తమకు పెద్దా చిన్నా అన్న తారతమ్యాలు లేవని చెప్పిన పోసాని జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు.. ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం కల్పించే విధంగా గుర్తింపు కార్డులను ఉచితంగా అందజేస్తామని అన్నారు. ఆర్టిస్టుల మధ్య తాము ఎటువంటి భేదభావం చూపము అని అంటూ.. ఏదో సినిమా డైలాగు వదులుదాము అన్న తాపత్రయంతో.. జూనియర్ ఆర్టిస్ట్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా.. అందరూ సమానమే అని అన్నాడు.

అన్న ఉద్దేశం బాగానే ఉంది కానీ ఇంతమంది స్టార్ హీరోలు ఉండదా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ పేరే ఎందుకు వాడాల్సి వచ్చింది అని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. పైగా జూనియర్ ఆర్టిస్టులతో జూనియర్ ఎన్టీఆర్ ను ఇలా పోల్చడం నచ్చని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోసాని తన స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్ గా పోరాడుతా… ఫస్ట్ టైం రెస్పాండ్ అయిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Big Stories

×