EPAPER

Pop Singer Biopic in OTT: త్వరలో భారత్ పాప్ సింగర్ బయోపిక్, డైరెక్ట్ గా ఓటీటీలోకి..

Pop Singer Biopic in OTT: త్వరలో భారత్ పాప్ సింగర్ బయోపిక్, డైరెక్ట్ గా ఓటీటీలోకి..

pop singer biopic,OTT soon


Pop Singer Biopic in OTT: భారతీయ సంగీత చరిత్రలో అమర్ సింగ్ చమ్కీలా జీవితానికి సంబంధించి ప్రత్యేక చాఫ్టర్ ఉంది. చమ్కీలా పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడా సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏఆర్ రహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు. పంజాబ్, లుథియానా సమీపంలో దుద్రీ గ్రామంలో చమార్ (ధళిత్) వర్గానికి చెందిన కుటుంబంలో 1960 జూలై 21న చమ్కీలా జన్మించారు. అతని అసలు పేరు ధనీరామ్ కాగా సంగీత ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అమర్ సింగ్ చమ్కీలాగా పేరు మార్చుకున్నారు.

1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదకు వచ్చి చమ్కీలా కారును అడ్డుకున్నారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా (27) సతీమణీ అమర్జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్జోత్ గర్భవతిగా ఉన్నారు. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చంపేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు.


Read More: మెట్రోలో రైతుకు నో ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో

దిల్జిత్ దోసాంజ్, పరిణీతి చోప్రా జోడీగా చమ్కీలా మూవీ తెరకెక్కింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదలకు సిద్దంగా ఉంది. ముఖ్యంగా పంజాబ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న చమ్కీలా మూవీ రిలీజ్ చేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. మూవీ అప్డేట్స్ పై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిమానులు మూవీని థియేటర్లో విడుదల చేయమని కోరారు.

Read More: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..

ఈ మూవీ 1980లలో అత్యంత పేదరికం నుంచి విపరీతమైన పాపులార్టీని చమ్కీలా ఎలా చేరుకున్నారు.కేవలం 27 ఏళ్ల వయసులో హత్యకు గురికావడం గురించి కథ చెబుతుంది. ఆయన పాటలు పంజాబ్ లో ఇప్పటికీ ప్రత్యక్ష వేదికలపై వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి జనం మర్చిపోలేని చమ్కీలాకు సంబంధించిన పాటలు ఇందులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ వల్ల భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ఆడియెన్స్ ఆ పాటలు చేరుకుంటాయని మూవీ దర్శకుడు ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు. పలు ప్రాంతీయ భాషల్లో కూడా చమ్కీలా మూవీని తీసుకొస్తామని ఆయన తెలిపారు.

Tags

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×