EPAPER

Pawan Kalyan: ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, అభిమానులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan: ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, అభిమానులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఒకపక్క సినిమాల్లోనే కాకుండా మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీగా మారారు పవన్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా క్రేజీగా ఎదురు చూసేవాళ్ళు. కెరీర్ స్టార్టింగ్ లోనే వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. అయితే ఆ బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కూడా పవన్ కి వరుస డిజాస్టర్లు వచ్చినా కూడా చెరిగిపోని ఇమేజ్ ను తెచ్చిపెట్టాయని చెప్పాలి. జానీ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు హిట్ సినిమా లేకపోయినా పవన్ కళ్యాణ్ మార్కెట్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. అలానే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ వచ్చింది.


మళ్లీ గబ్బర్ సింగ్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ అందుకున్నాడు పవన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసుకుంది. ఈ సినిమా తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమా కూడా మంచి హిట్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా అంతంత మాత్రమే ఆడాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అజ్ఞాతవాసి. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా సినిమాలు మానేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. అయితే ఎట్టకేలకు మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీయంట్రి ఇచ్చారు.

 


వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంకో మూడు సినిమాలు ఆన్ సెట్స్ పై ఉన్నాయి. వాటిలో ఎంతోమంది ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ. గతంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓజి సినిమా చూద్దురుగాని బాగుంటుంది అంటూ చెబుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా అప్డేట్లు అసలు లేకుండా పోయాయి. అయితే ఈరోజు వారాహి సభలో ప్రేక్షకులు ఎప్పటిలాగానే ఓజి ఓజి అంటూ అరవడం మొదలు పెట్టారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇది దేవుడికి సంబంధించిన సభ. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు. అలానే ఇస్లాం సమాజాన్ని చూసి ఖచ్చితంగా చాలా నేర్చుకోవాలి. వాళ్లు అల్లా అనగానే ఆగిపోతారు. కానీ మనం గోవిందా అని చెప్పినా కూడా ఇంకా అరుస్తూనే ఉంటాం. అంటూ అభిమానులపై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడకపోయినా కూడా అభిమానులు ఎంతగానో ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈపాటికి సెప్టెంబర్ 27న ఆ సినిమా రిలీజ్ అయి ఉండేది.

Related News

Samantha: నేను నీ మాటను తీసుకున్నాను..థాంక్యూ.. సమంత పోస్ట్ వైరల్

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, కానీ ఆడియన్స్ ను రప్పించడానికి అదనపు ఖర్చు

Janaka Aithe Ganaka : సినిమా రిలీజ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లాన్ చేసారు

Balagam/ Janaka aitey Ganaka : “బలగం”లా ఈ సినిమాను నిలబెట్టలా.?

Game Changer Release Date: కొడుకు కోసం తండ్రి కీలక నిర్ణయం, ‘విశ్వంభర’ స్థానంలోకి ‘గేమ్ ఛేంజర్‘?

Mohanraj: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ టాలీవుడ్ విలన్ కన్నుమూత

Big Stories

×