BigTV English

Pathan: చేంజ్ చేయ‌మ‌న్న సెన్సార్‌… షారుఖ్ ఏమంటారో?

Pathan: చేంజ్ చేయ‌మ‌న్న సెన్సార్‌… షారుఖ్ ఏమంటారో?

Pathan:ప‌ఠాన్ ఇప్పుడు జ‌స్ట్ నార్త్ ఇండియ‌న్ సినిమా మాత్ర‌మే కాదు, వేలాది మంది షారుఖ్ ఫ్యాన్స్ ఎమోష‌న్‌గా మారింది. నాలుగేళ్లుగా ప‌ర్ఫెక్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు షారుఖ్ ఫ్యాన్స్. ఈ సినిమాకు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. ఫ‌స్ట్ కాపీని సెన్సార్‌కి పంపించారు మేక‌ర్స్. అయితే సినిమాలో చాలా మార్పులు చెప్పి, అవ‌న్నీ చేసుకొస్తే సెన్సార్ చేస్తామ‌ని చెప్పార‌ట స‌భ్యులు. షారుఖ్, దీపిక జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా నుంచి భేష‌రం సాంగ్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచే గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. దీపిక బికినీల రంగు మీద అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీపిక డ్రెస్సింగ్ గురించి కూడా వాద‌న‌లు ఉన్నాయి. ప‌లు చోట్ల షారుఖ్ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేశారు. షారుఖ్ వైఖ‌రిలో మార్పు రాకుండా ఆయ‌న్ని స‌జీవంగా ద‌హనం చేస్తామ‌ని కూడా బెదిరించిన‌వారున్నారు.


ఇలాంటి సినిమా చేయాల‌న్న‌ది త‌న 17 ఏళ్ల క‌ల అని, య‌ష్ రాజ్ ఫిల్మ్స్ లో ఈ సినిమా మెటీరియ‌లైజ్ కావ‌డం ఆనందంగా ఉంద‌ని అంటున్నారు షారుఖ్‌. దీపిక మాత్రం ఈ గొడ‌వ‌ల గురించి అస‌లు ఎక్క‌డా నోరు విప్ప‌లేదు. షారుఖ్, అండ్ దీపిక ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్ అంటున్నారు యూత్‌. బేష‌రం సాంగ్‌లో దీపిక హొయ‌లు కేక అని మెచ్చుకుంటున్నారు. ప‌ఠాన్‌ని వ‌చ్చే నెల 25న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. హిందీతో పాటు త‌మిళ్‌, తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాను. హిందీలో పాట‌లు విడుద‌ల చేసే స‌మ‌యంలోనే సౌత్ లాంగ్వేజెస్‌లోనూ విడుద‌ల చేస్తున్నారు. సో ఇప్పుడు సెన్సార్ స‌భ్యులు సూచించిన మార్పుల‌ను చిత్ర యూనిట్ చేస్తుందా? లేకుంటే రివైజ్డ్ క‌మిటీ ముందుకు వెళ్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. రీసెంట్ టైమ్స్ లో ఫ్యాన్స్ తో త‌ర‌చూ చిట్‌చాట్ చేస్తున్న షారుఖ్ ఇప్పుడు సెన్సార్ ఇష్యూ గురించి నోరు విప్పుతారా? చూడాలి…


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×