Netflix Releases in 2024: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంది. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు, వెబ్ సిరీస్‌లను తీసుకొస్తూ ఆడియన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ ఏడాది ఏ ఏ సినిమాలు, సిరీస్‌లను విడుదల చేస్తుందో వాటికి సంబంధించిన టైటిల్స్ లిస్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా వెల్లడించింది.
ముంబైలో ఫిబ్రవరి 29న జరిగిన ఓ వేడుకలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే అందులో మొత్తం 14 వెబ్ సిరీస్‌లతో పాటు 8 సినిమాలు ఉండటం విశేషం.
ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది మొత్తం 8 సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. అందులో కొన్ని టైటిల్స్‌ను మరికొన్ని రిలీజ్ డేట్లను వెల్లడించింది. అందులో..
సినిమాలు:
READ MORE: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
అమర్ సింగ్ చంకీలా:
వివాదాస్పద సింగర్ అమర్ సింగ్ చంకీలా నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేస్తున్నాడు. 27 ఏళ్ల వయసులోనే అమన్ సింగ్ చంకీలాను హత్య చేశారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. దిల్జిత్ దోసాంజ్, పరిణీతి చోప్రా వంటి నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 27న విడుదల కానుంది. ఇక ఈ మూవీతో పాటు..
దో పట్టీ
మహరాజ్
మర్డర్ ముబారక్
ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా
సికందర్ కా ముఖద్దర్
విజయ్ 69
వైల్డ్ వైల్డ్ పంజాబ్ లాంటి సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్లను ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించలేదు.
వెబ్ సిరీస్‌లు:
ఈ ఏడాది మొత్తం 14 వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనున్నాయి. ఈ సిరీస్‌లలో కొన్ని కొత్తవి కాగా.. మరికొన్ని సీక్వెల్స్‌గా రూపొందుతున్నాయి. అయితే ఈ సిరీస్‌లకు సంబంధించి కూడా నెట్‌ఫ్లిక్స్ చాలా వాటికి స్ట్రీమింగ్ డేట్లను వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్‌సిరీస్‌గా పేరుగాంచిన హీరామండి కూడా ఆడియన్స్ ముందుకు వస్తుంది.
READ MORE: దృశ్యం చిత్రానికి మరో ఘనత.. హాలీవుడ్‌లో రీమేక్ కానున్న తొలి భారతీయ సినిమా..
ఈ హీరామండి సిరీస్ కోసం ఓటీటీ ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్ గ్లింప్స్ రిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ కాగా.. అప్పుడే ఈ సిరీస్ ఆడియన్స్ ముందుకు వస్తుందని ప్రకటించడంతో ప్రేక్షకులు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హా, సంజీదా షేక్, రిచా చద్దా వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులు నటిస్తున్నారు.
ఇకపోతే ఈ సిరీస్‌తో పాటు మరికొన్ని సిరీస్‌లు ఉన్నాయి. అందులో..
డబ్బా కార్టెల్
ఐసీ 814: ది కాందహార్ హైజాక్
ఖాకీ: ది బెంగాల్‌చాప్టర్
కోటా ఫ్యాక్టరీ సీజన్3
మామ్లా లీగల్‌హై (మార్చి 1నుంచి)
READ MORE: నేను తల్లిని కాబోతున్నానోచ్.. ఏ మంతో చెప్పేసిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
మండాలా మర్డర్స్
మిస్‌మ్యాచ్డ్ సీజన్3
యే కాలీ కాలీ ఆంఖే సీజన్2
ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో(మార్చి 30)
ది గ్రేటెస్ట్ రైవల్రీ – ఇండియా vs పాకిస్థాన్
టు కిల్ ఎ టైగర్
యోయో హనీసింగ్: ఫేమస్ లాంటి వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్దంగా ఉన్నాయి.