OTT: వీకెండ్ వస్తే చాలా మందికి ఫుల్ బోర్. టైమ్ పాస్ కాక తెగ వర్రీ అవుతుంటారు. పార్కులు, రెస్టారెంట్లు ఫ్యామిలీ పర్సన్స్‌కే ఇంట్రెస్టింగ్. పబ్‌లు, పార్టీలకు వెళ్లేవారి సంఖ్య తక్కువే. ఎక్కువ మందికి కాలక్షేపం సినిమాలే. అయితే, కరోనా తర్వాత పెద్దగా కొత్త సినిమాలేవీ రావట్లేదు. OTTనే చాలామందికి మెయిన్ ఎంటర్టైన్మెంట్ సోర్స్. అందులోనూ సిరీస్‌లు తగ్గిపోయాయి. వచ్చింది వచ్చినట్టే చూసేస్తున్నారు జనాలు. ఫ్రైడేనే కంటెంట్ అంతా కంప్లీట్ చేసేస్తున్నారు. మళ్లీ శని, ఆదివారాలు బోర్.
ఈ వీకెండ్ అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదు. మస్త్ సినిమాలు, సిరీస్‌లు వచ్చేశాయ్. OTT ఓవర్ లోడ్‌తో రెడీగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు/సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇంకేం.. నెక్ట్స్ రెండు రోజులు, మూడు రాత్రులు పండుగ చేస్కోవచ్చు ఓటీటీ లవర్స్.
హీరో ధనుష్ రీసెంట్ హిట్ ‘సార్’ ఈ ఫ్రైడేనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. వెంకీ అట్లూరి డైరెక్టర్‌గా.. విద్యను వ్యాపారంగా మార్చిన వ్యవస్థపై తిరగబడిన ఓ లెక్చరర్ కథతో తీసిన ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడిక ఓటీటీలో సందడి చేయనున్నారు ధనుష్ ‘సార్’.
సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ సైతం ఈవారమే ‘జీ5’లో రిలీజ్ అవుతోంది. యువ రచయితకు ఎదురైన సవాళ్లు.. వాటిని అతడు ఎలా ఫేస్ చేశాడనేది ఈ సినిమా స్టోరీ లైన్.
సార్, రైటర్ పద్మభూషణ్‌తో పాటు పలు సినిమాలు, సిరీస్‌లు ఈ శుక్రవారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఆ లిస్ట్ ఇలా ఉంది…
నెట్‌ఫ్లిక్స్:
సార్/వాతి – తెలుగు/తమిళ్ సినిమా
ది మెజిషియన్స్ ఎలిఫెంట్ – ఇంగ్లీష్ సినిమా
కుత్తే – హిందీ సినిమా
కాట్ అవుట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్ – ఇంగ్లీష్/హిందీ (డాక్యుమెంటరీ)
ఏజెంట్ ఎల్విస్ – ఇంగ్లీష్ సిరీస్ సీజన్ -1
స్కై హై : ది సిరీస్ – స్పానిష్ సిరీస్ సీజన్ -1
మ్యాస్ట్రో ఇన్ బ్లూ – గ్రీక్ సిరీస్ సీజన్ -1
డ్యాన్స్ 100 – ఇంగ్లీష్ రియాల్టీ సిరీస్
నాయిస్ – మెక్సికన్ సినిమా
ఇన్ హిస్ షాడో – ఫ్రెంచ్ సినిమా
జీ 5:
రైటర్ పద్మభూషణ్ – తెలుగు సినిమా
యామ్ ఐ నెక్స్ట్ – హిందీ సినిమా
ఆహా:
సత్తిగాడి రెండు ఎకరాలు – తెలుగు సినిమా
లాక్డ్ – తమిళ్ సిరీస్ (ఆహా తమిళ్)
ప్రైమ్ వీడియో:
బ్లాక్ ఆడమ్ – ఇంగ్లీష్ సినిమా
డామ్ – ఇంగ్లీష్ సిరీస్ సీజన్-2
గంధదగుడి – కన్నడ సినిమా
సోనీలివ్:
ది వేల్ – ఇంగ్లీష్ సినిమా
రాకెట్ బాయ్స్ – హిందీ సిరీస్ సీజన్ -2
హాట్‌స్టార్:
పాప్ కౌన్ – హిందీ సిరీస్ సీజన్ -1
సన్ నెక్స్ట్:
వన్స్ అపాన్ ఎ టైమ్ జమాలిగూడ – కన్నడ సినిమా
Nani : ఆ దెబ్టకు భయపడ్డ నాని.. రెండు నెలలు పట్టిందంటున్న నేచురల్ స్టార్
Covid: వామ్మో.. మళ్లీ కరోనా!.. తెలంగాణకు కేంద్రం అలర్ట్..