EPAPER
Kirrak Couples Episode 1

Oscar 2025 : అఫిషియల్ గా ఆస్కార్ బరిలోకి అడుగు పెట్టిన “లాపతా లేడిస్”

Oscar 2025 : అఫిషియల్ గా ఆస్కార్ బరిలోకి అడుగు పెట్టిన “లాపతా లేడిస్”

Oscar 2025 : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 97వ అకాడమీ అవార్డ్స్‌కు కిరణ్ రావు చిత్రం లాపతా లేడిస్ భారతదేశం నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ చిత్రం ఆస్కార్ 2025 కోసం పోటీ పడిన 29 ఇతర భారతీయ చిత్రాలను అధిగమించి ఇప్పుడు అఫిషియల్ గా ఆస్కార్ బరిలోకి అడుగు పెట్టడం విశేషం. లాపతా లేడిస్ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.  ఇతర అత్యుత్తమ అంతర్జాతీయ చిత్రాలతో పాటు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడబోతోందన్న మాట లాపతా లేడిస్.


చిన్న సినిమా పెద్ద విజయం 

గ్రిప్పింగ్ స్టోరీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న లాపతా లేడిస్ మూవీ ఇప్పుడు ఆస్కార్‌కు వెళ్లనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం  కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ఆస్కార్ 2025 కి ఇండియా నుంచి అధికారికంగా ఎంట్రీ ఇస్తున్న చిత్రంగా నిలిచింది. జాహ్ను బారువా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసిన 29 ఇండియన్ సినిమాలలో లాపతా లేడిస్ కూడా ఒకటిగా చేరింది.  ఆస్కార్ కోసం పోటీలో నిలిచిన సినిమాలలో రణబీర్ కపూర్ యానిమల్, కార్తీక్ ఆర్యన్ చందు ఛాంపియన్, ప్రభాస్ కల్కి 2898 AD, జాతీయ అవార్డు గెలుచుకున్న మలయాళ చిత్రం శ్రీకమ్ కమ్త్, లాపతా లేడిస్ వంటి సినిమాలు మొత్తంగా 29 ఉన్నాయి.


ఇంతకుముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకురాలు కిరణ్ రావు “నా సినిమాలలో ఒక్క మూవీ అయినా ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డును సాధించడం అన్నది నా చిరకాల కల. లాపతా లేడిస్ ఆస్కార్‌కు వెళితే ఆ కల నెరవేరుతుంది. కానీ ఇది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ మొత్తాన్ని దాటుకుని లాపతా లేడిస్ ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను” అని అన్నారు. కాగా కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆమె మాజీ భర్త, సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రం 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో కూడా ప్రీమియర్ అయ్యి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది.

Kiran Rao-directorial 'Laapata Ladies' is India's official entry for Oscars 2025 - BusinessToday

లాపతా లేడిస్ స్టోరీ ఏంటంటే?

లాపతా లేడిస్ మూవీ మొత్తం 2001 ఏడాదిలో నడుస్తుంది. దీపక్ కుమార్, పూల్ కుమారి అనే జంటకు అప్పుడే పెళ్లి అవుతుంది. దీపక్ సొంత ఊరికి వెళ్లడానికి రైలులో తన భార్యతో కలిసి ప్రయాణం అవుతాడు. అయితే అది పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో వీళ్ళు ప్రయాణిస్తున్న ట్రైన్ లోనే కొత్తగా పెళ్లయిన మరికొన్ని జంటలు కూడా ఉంటాయి. ఆచారం ప్రకారం కొత్త పెళ్లికూతుర్లు అందరూ ముఖానికి ముసుగు వేసుకొని దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరించి కనిపిస్తారు. దీపక్ తన భార్య కుమారి.. పుష్పరాణి అలియాస్ జయ పక్కన కూర్చుంటారు. రాత్రి వేళ దిగాల్సిన స్టేషన్ రావడంతో ఆ తొందర్లో దీపక్ తన భార్యను కాకుండా పుష్ప రాణిని తీసుకొని ట్రైన్ దిగిపోతాడు. అయితే ముసుగు వల్ల దీపక్ ను సరిగ్గా చూడలేక తన భర్త అనుకుంటుంది జయ. కానీ తీరా గ్రామానికి వెళ్ళాక ఆమె కుమారి కాదు పుష్ప రాణి అని తెలుసుకున్న దీపక్ అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నివ్వెరపోతారు. ఇక దీపక్ వెంటనే తన భార్యను వెతుక్కుంటూ వెళతాడు. ఆయనకు తన భార్య దొరికిందా? కుమారి ఎక్కడికి వెళ్ళింది? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడాల్సిందే. ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంట, రవికిషన్, ఛాయా కదమ్, దుర్గేశ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Related News

Sandeep Kishan : పేరు మార్చుకున్న యంగ్ హీరో… న్యూమరాలజిని నమ్ముకుంటే లక్ కలిసొస్తుందా?

Laapataa Ladies: ఆస్కార్ కి ఎంట్రీ ఇచ్చిన లాపతా లేడీస్.. కథ తెలిస్తే దిమ్మతిరుగుతుంది

Pushpa 2 Release Date: ఆ రోజు ‘పుష్ప 2’ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Bigg Boss Telugu 8 : నేను తప్పుగా మాట్లాడలేదు… బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ పరువు తీస్తున్న అభయ్..!

Viswam Story : గోపీచంద్ ఫ్యాన్స్ కు షాక్… విశ్వం స్టోరీ లీక్, హీరో రోల్ ఇదే?

Rajinikanth’s Coolie: తెలుగులో భారీ బిజినెస్.. థియేట్రికల్ రైట్స్ వారి సొంతం..!

Big Stories

×