EPAPER

Jr.NTR : ఇక నో బ్రేక్ అంటున్న ఎన్టీఆర్ ..? ఫ్యాన్స్ కు పండగే ..

Jr.NTR : ఇక నో బ్రేక్ అంటున్న ఎన్టీఆర్ ..? ఫ్యాన్స్ కు పండగే ..

Jr.NTR : ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఇంటెర్నేషనల్ స్థాయికి పెరిగింది. దాంతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమా దేవర సినిమా చేసాడు. ఆ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న కూడా స్లోగా సినిమాకు రెస్పాన్స్ భారీగా పెరిగిందనే చెప్పాలి. సినిమా రిలీజ్ కు ముందే సినిమాకు పెట్టిన ఖర్చును రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ ను అందుకుంది. రిలీజ్ అయ్యాక కూడా అదే టాక్ తో దూసుకుపోతుంది . ఇరవై రోజులు అవుతున్నా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు . కాగా తాజాగా తన సినిమాల విషయంలో ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నాడనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.


ప్రపంచవ్యాప్తంగా ఇంకా దేవర మ్యానియా కొనసాగుతుంది. సినిమా పై ఇప్పటికి అదే రెస్పాన్స్ రావడం మాములు విషయం కాదు. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తరువాత కాస్త బ్రేక్ తీసుకుంటున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. కొద్దీ రోజుల తర్వాత తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే ఆల్రెడీ ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని విషయం తెలిసిందే..

ఇక ఇప్పటికే బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు. ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్-2’ లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌ లో సినిమా చేయనున్నాడు. ఇక నవంబర్ నుండి ఎన్టీఆర్ ‘వార్-2’ షూటింగ్‌ లో జాయిన్ అవుతున్నాడు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుని నీల్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ తో పాటుగా అటు సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్‌లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ లేని సీన్స్‌కి సంబంధించిన షూట్ జరపుకునేందుకు ఆయన రెడీ అవుతున్నాడు. ఆ తరువాత తారక్ కూడా మూవీ షూటింగ్‌లో జాయిన్ కానుండటంతో, ఎలాంటి బ్రేక్ లేకుండా తారక్ తన నెక్స్ట్ రెండు సినిమాల ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అంటే రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎప్పుడెప్పుడెప్పుడు సినిమాల ను చూస్తామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ల తో సినిమా చేయనున్నాడని సమాచారం.. ఏ డైరెక్టర్ ఎలాంటి సినిమాను చేస్తున్నాడో త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి..


Related News

Vijay Devarakonda : దేవరకొండ కాళ్లపై పడ్డ కేరళ అభిమాని… సినిమాలను మాత్రం హిట్ చేయరు

Salman Khan : సల్మాన్ ఖాన్ కు భద్రత కట్టుదిట్టం… ‘బిగ్ బాస్ ‘ షూటింగ్ పరిస్థితి ఇదీ!!

Pushpa 2: ఉత్తరాంధ్రలో భారీ ధర.. ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదే..!

Anee Master : జానీ గురించి అనీ మాస్టర్ ప్రెస్ మీట్… వెనకుండి ఇంత కథ నడిపించింది ఆ స్టార్ హీరోనా?

Anee Master : జానీ మాస్టర్ మంచోడు.. అరెస్టుపై విస్తుపోయే నిజాలు..!

SSMB -29: మహేష్ – రాజమౌళి నుంచీ బిగ్ అప్డేట్.. ఊహించలేదుగా.. !

Samantha: మయోసైటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధి కూడా.. హాట్ బాంబ్ పేల్చిన సామ్..!

Big Stories

×