BigTV English

NTR new Movie update : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్‌.. వెట్రిమార‌న్ క్లారిటీ!

NTR new Movie update  : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్‌.. వెట్రిమార‌న్ క్లారిటీ!

NTR new Movie update : టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక‌రైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు అన్నీ క్రేజీ ప్రాజెక్ట్‌నే లైన్‌లో పెట్టారు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ సినిమాను చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వార్ 2, ప్ర‌శాంత్ నీల్ సినిమాల్లో తార‌క్ న‌టించాల్సి ఉంది. అయితే వీట‌న్నింటితో పాటు త‌మిళంలో వెర్స‌టైల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చ‌కున్న వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనూ తార‌క్ ఓ సినిమా చేస్తాడేనే వార్త‌లు వినిపించాయి. వెట్రిమార‌న్ రెండు భాగాలుగా ఓ సినిమాను చేయాల‌నుకుంటున్నార‌ని, అందులో తొలి భాగంలో ఎన్టీఆర్, సెకండ్ పార్ట్‌లో ధ‌నుష్ హీరోగా న‌టిస్తార‌నే వార్త‌లు గట్టిగానే వినిపించాయి. అయితే ఇందులో నిజానిజాలేంట‌నే దానిపై ఎవ‌రూ క్లారిటీ ఇవ్వ‌లేదు.


అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘ఆడుగలం తర్వాత నేను అల్లు అర్జున్‌కి క‌లిశాను. త‌న‌కు వ‌డ చెన్నై సినిమాలోని ప‌వ‌ర్ ఫుల్ పాత్ర గురించి చెప్పాను. అయితే ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. నిజానికి బ‌న్నీ పాత్ర ముందు అనుకున్న వెర్ష‌న్‌లో ఉంది. కానీ త‌ర్వాత చాలా మార్పులు చేర్పులు జ‌రిగాయి. త‌ర్వాత మ‌హేష్‌ను క‌లిసి ఓ క‌థ‌ను చెప్పాను. అది కూడా సెట్ కాలేదు. త‌ర్వాత అసుర‌న్ రిలీజ్ అయ్యింది. త‌ర్వాత నేను ఎన్టీఆర్‌ను క‌లిశాను. ఇద్ద‌రం ఎన్నో విష‌యాల‌ను మాట్లాడుకున్నాం. ఆయ‌న‌తో ఓ సినిమా చేసే అవ‌కాశం ఉంది. అయితే అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అయితే అది సోలో హీరో సినిమానా, మ‌ల్టీస్టార‌ర్ సినిమానా అని కాల‌మే స‌మాధానం చెబుతుంది’ అన్నారు.

ప్ర‌స్తుతం వెట్రిమార‌న్ డైరెక్ష‌న్‌లో రూపొందిన విడుద‌లై సినిమా తెలుగు వెర్ష‌న్ విడుద‌ల ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో క‌మెడియ‌న్ సూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు. త్వ‌ర‌లోనే విడుద‌ల పార్ట్ 2 తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా త‌ర్వాత వెట్రిమార‌న్ డైరెక్ష‌న్‌లో సూర్య హీరోగా వాడివాసల్ తెర‌కెక్క‌నుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×