EPAPER

NTR Devara: దేవర మూవీకి ముఖ్య అతిథిగా ‘అతడు’.. ఊహించని గెస్ట్

NTR Devara: దేవర మూవీకి ముఖ్య అతిథిగా ‘అతడు’.. ఊహించని గెస్ట్

NTR movie Devara pre release event..Mahesh babu guest: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు ఎన్టీఆర్, హీరో కృష్ణ ఇద్దరూ మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా సందర్భాలతో వీరి సినిమాలు సంక్రాంతి, దసరా బరిలో పోటీ పడ్డాయి. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి సంచలనం సృష్టించి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత హీరో కృష్ణ కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఏలూరు నుంచి గెలుపొందారు. అయితే వారి వారసులు గా వచ్చారు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు. ఇద్దరూ కలిసి నటించే అవకాశం అయితే రాలేదు కానీ బయట వీరిద్దరూ మంచి స్నేహ సంబంధాలు కలిగివున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ మూవీ చెయ్యలేదు ఒక్క దేవర మూవీ తప్ప.


హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్

ఆచార్య మూవీతో అప్ సెట్ అయిన కొరటాల శివ ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించారని సమాచారం. అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్. ఇప్పుడు అదే తరహాలో జాన్వీకపూర్, జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటి వరకూ ఈ మూవీపై వచ్చిన అప్ డేట్స్ అన్నీకూడా ఎన్టీఆర్ అభిమానులనే కాదు..ప్రేక్షకులను కూడా అలరించాయి. ఇక సెప్టెంబర్ 10న దేవర మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సినిమా విడుదలకు వారం ముందు హైదరాబాద్ లో దేవర మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మహేష్ బాబు వస్తున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్మాతలు ప్రకటించలేదు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు, భరత్ అను నేను సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో తెలిసిందే.


ప్రిన్స్ ని ఒప్పించిన కొరటాల

కొరటాల శివ మహేష్ బాబును స్సెషల్ గెస్టుగా రావలసిందిగా కోరినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం మూవీ తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు. త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. ఈ మూవీ కోసం మహేష్ బాబు మరో మూడేళ్ల పాటు టాలీవుడ్ కు దూరంగా ఉంటారని సమాచారం. ఎందుకంటే జక్కన్న ఏ మూవీని చేపట్టినా దానిని ఎంతో కళాత్మక శిల్పంలా మలుస్తారు. బాహుబలి మూవీ కోసం ప్రభాస్ కూడా మూడేళ్లకు పైగా రాజమౌళితోనే ప్రయాణం చేశారు. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీకి కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ చాలా ఎక్కువ సమయమే కేటాయించారు.

కారంచేడు నేపథ్యమేనా?

దేవర మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. నిజ జీవితంల జరిగిన సంఘటనలతో రూపొందించిన సినిమాగా ఈ సినిమా గురించి ఒక టాక్ నడుస్తోంది. అప్పట్లో సంచలనం రేపిన కారంచేడు లో దళితుల ఊచకోత సంఘటన నేపథ్యంగా ఈ మూవీని కొరటాల రూపొందించారని వార్తలొస్తున్నాయి. మూవీ అంతా భావోద్వేగాలతో నిండి ఉంటుందని..ఎన్టీఆర్ నటన ఈ మూవీకి హైలెట్ అని అంటున్నారంతా. ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయాలని కూడా అనుకుంటున్నారు. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

 

Related News

Johnny Master Case : కిరాచక భార్యాభర్తలు… సాటి మహిళ కూడా కనికరించలే..

Political Celebrities: నష్ట జాతకులుగా మారిన సెలబ్రిటీస్.. మొన్న పృథ్వీ.. నేడు జానీ..!

Siddarth -Aditi Rao Hydari: మరీ ఇంత మోసమా… కాస్త ఆలోచించాల్సింది లవ్ బర్డ్స్

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Big Stories

×