EPAPER
Kirrak Couples Episode 1

Devara 4 Days Collections : సునామీ సృష్టిస్తున్న దేవర.. 4 రోజులకు ఎన్ని కోట్లంటే?

Devara 4 Days Collections : సునామీ సృష్టిస్తున్న దేవర.. 4 రోజులకు ఎన్ని కోట్లంటే?

Devara 4 Days Collections : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవర.. ఈ సినిమా సెప్టెంబర్ 27 న విడుదలయింది. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ రికార్డ్ లను బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ మోత మోగిస్తుంది. రోజు రోజుకు సినిమాకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆరేండ్ల తరువాత తారక్ సోలో హీరోగా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ డీసెంట్ టాక్ , పాజిటివ్ రివ్యూలతో దేవరకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మూడు రోజులుగా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా వసూళ్లను అందుకుంటుంది. మరి నాలుగు రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..


టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర మానియా కొనసాగుతుంది.. ఎక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది. ఈ మూవీకి మాస్ డైరెక్టర్ కొరటాలా శివ దర్శకత్వం వహించగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.. ఈ సినిమా బడ్జెట్ ఎప్పుడో కలెక్ట్ చేసింది. ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుండటంతో గతంలో తారక్ ఏ సినిమాకు రానంత బజ్‌ దేవరకు క్రియేట్‌ అయింది. ఊర మాస్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించడం, అలాగే అదిరిపోయే యాక్షన్ సీన్స్. ఇంకా చెప్పాలంటే గూస్ బంప్స్ తెప్పిస్తున్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అయ్యింది. అందుకే సినిమా సక్సెస్ ను అందుకుంది..

ఇక దేవర కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజు ఏకంగా రూ. 172 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ. 243 ప్లస్ గ్రాస్ రాబట్టిందని దేవర టీమ్ అధికారికంగా ప్రకటించారు. మూడు రోజులకు గాను 304 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. 1900 షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 9 కోట్ల షేర్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియా వైడ్‌గా 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్సుగా నమోదు చేసింది. దేవర సినిమాకు ఇండియా మొత్తం కలిపి రూ. 30 కోట్లు రాబట్టింది. రెండో రోజు అన్ని ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. రూ. 243 కోట్లు వసూల్ చేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇక మూడో రోజుకు గాను మరో 45 కోట్లు పెరిగినట్లు తెలుస్తుంది. అంటే మొత్తంగా దాదాపు రూ. 304 కోట్లకు పెరిగింది. ఇక నాల్గొవా రోజు ఘోరంగా పడిపోయాయి. సండే తో పోల్చితే.. నియర్లీ దాదాపు 70-75 శాతం టికెట్ సేల్స్ డ్రాప్ అయ్యాయి. అలాగే.. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా డ్రాప్స్ కనిపించింది. రూ. 320 కోట్ల వరకు వసూలు చేసిందనే టాక్ వినిపిస్తుంది. మరి ఎంత వసూల్ చేసిందో చూడాలి.. ఇక ఇప్పటిలో ఈ సినిమాకు పోటీగా ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఇదే జోరుతో దేవర కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం తన తర్వాత సినిమాలతో బిజీ అయ్యాడు.


Related News

Jr NTR vs Ram Charan : గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే ఇదే మరి… తారక్ పై ఈజీగా గెలిచాడు..

Rajinikanth : రజినీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

Rajinikanth: అర్థరాత్రి ఆసుపత్రికి రజనీకాంత్, ఏమైంది?

Simbu : నిధి అగర్వాల్ తో శింబు పెళ్లి.. అసలు మ్యాటరేంటంటే?

Top OTT Platform : టాలీవుడ్ లో భారీ స్కాం… ఇక ఇండస్ట్రీలో ఈ ఓటీటీ దూరం .. అవ్వనుందా ?

Madhoo Bala: సీనియర్ నటి మధుబాల కూతుళ్లను చూశారా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Big Stories

×